Nani Sujeeth Movie: ఓజీతో ఈ నెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు డైరెక్టర్ సుజీత్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ కోసం వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఓజీ రికార్డులు తిరగరాయడం పక్కగానే కనిపిస్తోంది. రిలీజ్‌కు మరో పదిహేను రోజులు టైమ్ ఉండగానే ఓవర్‌సీస్‌లో ఓజీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే వన్ మిలియన్‌ను క్రాస్ చేసింది. ఓవరాల్‌గా రిలీజ్ టైమ్‌లోగా ఐదు మిలియన్లను చేరుకునేలా ఉంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా…
ముంబాయి బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ఓజాస్ గంభీర అనే డాన్‌గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. పవన్ మేనియాతో థియేటర్లు ఊగిపోవడం పక్కా అని అంటున్నారు.
Also Read- Lady Oriented Movies: లాభాల బాటలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్
బ్లడీ రోమియో….
కాగా ఓజీ తర్వాత తన నెక్స్ట్ మూవీని నానితో చేయబోతున్నారట డైరెక్టర్ సుజీత్. వీరిద్దరి కాంబోపై టాలీవుడ్‌లో చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఓజీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాని, సుజీత్ సినిమా ఫిక్సయ్యిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో హై యాక్షన్ థ్రిల్లర్‌గా నాని, సుజీత్ మూవీ రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పృథ్వీరాజ్…
ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. నాని, సుజీత్ మూవీ షూటింగ్ చాలా వరకు ఫారిన్‌లోనే సాగనుందట. లోకేషన్స్ రెక్కీ కోసం నవంబర్‌లో సుజీత్ అండ్ టీమ్ యూరప్ వెళ్లనున్నట్లు చెబుతోన్నారు.
2026 ఫిబ్రవరి నుంచి నాని, సుజీత్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్‌తో నాని బిజీగా ఉన్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 మార్చి 26న రిలీజ్ కాబోతుంది.


