Nani – Sujeeth: నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే కల్ట్ యాక్షన్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ నాని నటించని ఓ వెరైటీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఇందులో విలన్ గా నటిస్తున్న సీనియర్ నటుడు మోహన్ బాబు పాత్రకి సంబంధించిన లుక్ ని కూడా రివీల్ చేశారు.
మోహన్ బాబు (Manchu Mohan babu) లుక్ రివీల్ చేసిన తర్వాత ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. అయితే, ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, నాని తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాడు. రన్ రాజా రన్, సాహో, ఓజీ చిత్రాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా మారిన యంగ్ అండ్ డైనమిక్ సుజీత్ దర్శకత్వంలో నాని తన కొత్త సినిమాను ఈ దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఈ మూవీ ఓపెనింగ్ కి సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హాజరయ్యారు.
Also Read – Sreeleela – Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కి శ్రీలీల షాక్.. బాలీవుడ్‌లో పాగా వేసే ప్రయత్నాలు
అగ్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో చేసిన ఓజీ (OG) మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌లో మునిగితేలుతున్నారు. ముందు నుంచి ఉన్న అంచనాలకి మించి ఓజీ సక్సెస్ కావడం అతికొద్ది రోజుల్లోనే ఊహించని వసూళ్ళు రాబట్టంతో ఇండస్ట్రీలో సుజీత్ హాట్ టాపిక్ అయ్యాడు. సాహో (Saaho), ఓజీ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాల తర్వాత సుజీత్ డైరెక్షన్ లో వచ్చే సినిమా ఇంకా భారీ స్థాయిలో ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, అందుకు భిన్నంగా తన మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ లాంటి ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ని నానితో (Natural star Nani) ప్లాన్ చేశారు. టైటిల్ చూస్తేనే ఇది పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని అర్థమవుతోంది. ప్రస్తుతానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఇంతకాలం నేచురల్ స్టార్ గా క్రేజ్ ఉన్న నానీని.. సుజీత్ ‘బ్లడీ రోమియో’గా మార్చబోతున్నాడు. కాగా, ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ సహా మిగతా వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
Also Read – Mana Shankaravaraprasadgaru: ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..


