Monday, February 24, 2025
Homeచిత్ర ప్రభThe Paradise: నాని ‘ది ప్యారడైజ్’ అప్డేట్ వచ్చేసింది

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ అప్డేట్ వచ్చేసింది

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. గతేడాది ‘సరిపోదా శనివారం’ మూవీతో పలకరించిన నాని ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ‘హిట్‌3: ది థర్డ్‌ కేస్‌’ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

తన కెరీర్‌లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు నాని ప్రకటించాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News