Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMarriage: రోహిత్, శిరీష పెళ్లి వేడుక.. సందడంతా నారా వారి కుటుంబానిదే!

Marriage: రోహిత్, శిరీష పెళ్లి వేడుక.. సందడంతా నారా వారి కుటుంబానిదే!

Marriage: టాలీవుడ్ హీరో నారా రోహిత్, శిరీష లేళ్ల పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ ప్రేమ జంట పెళ్లి పీటల వరకు ఎలా వచ్చింది? అనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయం. వారి ప్రేమకథ ఎక్కడో కాదు… వారు కలిసి పనిచేసిన సినిమాతోనే మొదలైంది. నారా రోహిత్ నటించి, సొంతంగా నిర్మించిన సినిమా ‘ప్రతినిధి 2’. ఈ మూవీలో హీరోయిన్‌గా శిరీష లేళ్లను తీసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ దగ్గరయ్యారు. మొదట్లో సినిమా విషయాలు, వృత్తి గురించి మాట్లాడుకునేవారు. కానీ, రోజులు గడిచే కొద్దీ రోహిత్ ఆలోచనలు, శిరీషా అభిప్రాయాలు బాగా కలిశాయి. ఇద్దరి వ్యక్తిత్వం ఒకరికొకరు బాగా నచ్చింది.

- Advertisement -

పరిచయం ప్రేమగా మారి…

కేవలం సహనటులుగానే కాకుండా, జీవిత భాగస్వాములుగా కూడా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. తమ ఈ ప్రేమ విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత, గతేడాది వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత, అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా, సినీ, రాజకీయ ప్రముఖుల సాక్షిగా వారి వివాహం జరిగింది.

పెళ్ళికి హాజరైన వాళ్ళు వీరే!

నారా రోహిత్, శిరీష లేళ్ల వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా, పెళ్లి పెద్దగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి సహా నారా కుటుంబ సభ్యులు,
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విచ్చేయడం ఈ పెళ్లి వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సినీ పరిశ్రమ నుండి, నటులు మంచు మనోజ్, శ్రీ విష్ణు వంటి పలువురు తారలు, హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-review-telugu/

సినిమా సెట్‌లో మొదలైన వీరి స్నేహ బంధం, ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండే బంధంగా మారడం అందరినీ ఆకట్టుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad