Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభNarappa : ముందు ఓటీటీ.. ఇప్పుడు థియేటర్లోకి.. వెంకటేష్ ఊర మాస్ సినిమా..

Narappa : ముందు ఓటీటీ.. ఇప్పుడు థియేటర్లోకి.. వెంకటేష్ ఊర మాస్ సినిమా..

- Advertisement -

Narappa : ధనుష్ తమిళ్ లో చేసిన అసురన్ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’గా రీమేక్ చేశారు. ప్రియమణి వెంకటేష్ సరసన నటించగా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే అప్పుడు కరోనా సమయంలో థియేటర్స్ లేకపోవడంతో అమెజాన్ ఓటీటీలో నారప్ప సినిమాని రిలీజ్ చేశారు.

దీంతో వెంకటేష్ ఊర మాస్ పర్ఫార్మెన్స్ ని థియేటర్స్ లో చూసే ఛాన్స్ మిస్ అయింది. అలా మిస్ అయిందని బాధపడే వాళ్ళ కోసం తాజాగా ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టిన రోజు నాడు నారప్ప సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో ఒక్క రోజు మాత్రమే రిలీజ్ చేయనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

దీంతో విక్టరీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ మాస్ మేనియాని స్క్రీన్ మీద చూడటానికి రెడీ అయిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News