Marokkasari Title Poster: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ రావడం తక్కువైంది. ఆ లోటును భర్తీ చేస్తూ రూపొందుతోన్న మూవీ మరొక్కసారి. నరేష్ అగస్త్య, సంజన సారధి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బైక్‌పై ప్రేమ జంట వెళుతూ కనిపిస్తున్నారు. ఆ బైక్ కింద బుక్ ఉండటం, రోడ్స్‌ను పోలిన సింబల్స్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
షూటింగ్ కంప్లీట్…
మరొక్కసారి సినిమాను సి.కె.ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ లవ్ డ్రామా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. మరొక్కసారి మూవీకి భరత్ మాంచి రాజు మ్యూజిక్ అందించారు. కథానుగుణంగా ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని, వీటిని కార్తిక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్ టాప్ సింగర్లు ఆలపించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాటలు సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సాంగ్స్ పలు అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసినట్లు నిర్మాత పేర్కొన్నారు.
ఫస్ట్ మూవీ….
మరొక్కసారి మూవీ షూటింగ్ కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఎవరూ కూడా షూటింగ్ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌లో షూటింగ్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా మరొక్కసారి నిలిచింది. ఆ విజువల్స్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతాయని మేకర్స్ అన్నారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించామని నిర్మాత పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేస్తామని వెల్లడించారు.
బ్రహ్మాజీ…
మరొక్కసారి మూవీలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకటేష్ కాకుమాను, దివ్యవాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రోహిత్ బచ్చు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా…ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mahesh-birth-day-spl-from-ssmb-29/


