Nargis Fakhri Marriage: బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత ఈ సీక్రెట్ బయటపడింది. నర్గీస్ ఫక్రీ పెళ్లి జరిగిన విషయాన్ని అనుకోకుండా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ బయటపెట్టింది.
మూడేళ్లుగా ప్రేమాయణం…
బిజినెస్‌మెన్ టోనీ బేగ్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉన్న నర్గీస్ ఫక్రీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడిని పెళ్లాడిందట. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు సమక్షంలో చాలా సింపుల్‌గా నర్గీస్ ఫక్రీ, టోనీ బేగ్ పెళ్లి జరిగినట్లు సమాచారం. వివాహం తర్వాత ఈ జంట హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినట్లు చెబుతోన్నారు.
ఆరు నెలల తర్వాత…
పెళ్లి జరిగి ఆరు నెలలు అయినా ఈ సీక్రెట్‌ను రహస్యంగా దాస్తూ వచ్చారు ఈ జంట. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నర్గీస్ ఫక్రీ తన పెళ్లి ఫొటోలను మాత్రం షేర్ చేయలేదు. ఈ ఆరు నెలల్లో టోనీ బేగ్, నర్గీస్ ఫక్రీ జంటగా అభిమానులకు కనిపించకపోవడంతో ఎవరికి అనుమానం రాలేదు.
Also Read – Revanth reddy : అమరావతి పెద్ద గుదిబండ.. ఏపీ రాజధనిపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
షాకిచ్చిన ఫరాఖాన్…
ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు టోనీ బేగ్‌తో కలిసి నర్గీస్ ఫక్రీ హాజరైంది. ఈ వేడుకకు బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్ కూడా అటెండ్ అయ్యింది. రెడ్ కార్పెట్‌పై ఫొటోలు దిగే టైమ్‌లో నర్గీస్ ఒంటరిగా కనిపించడంతో వచ్చి నీ భార్య పక్కన నిల్చో అంటూ టోనీ బేగ్‌తో ఫరాఖాన్ చెప్పింది. నర్గీస్ ఫక్రీని టోనీ బేగ్ భార్యగా ఫరాఖాన్ సంబోధించడంతో వీరి పెళ్లి సీక్రెట్ బయటపడింది. నర్గీస్ పెళ్లెప్పుడు చేసుకుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా… మరికొందరు మాత్రం ఈ బాలీవుడ్ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. టోనీ బేగ్‌తో నర్గీస్ ఫక్రీ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్‌గా ఎంట్రీ…
రణభీర్‌కపూర్ రాక్‌స్టార్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నర్గీస్ ఫక్రీ. అజార్, హౌస్‌ఫుల్ 3, అమవాస్, తూర్బాజ్ సినిమాలు హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తె చ్చిపెట్టాయి. సల్మాన్ ఖాన్ కిక్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది నర్గీస్ ఫక్రీ. హాలీవుడ్‌లో స్పై మూవీతో పాటు ఫైవ్ వెడ్డింగ్స్ అనే సినిమాలో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్ 5లో నర్గీస్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ 250 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది.
Also Read – kaleshwaram project: సీబీఐ విచారణకు కాళేశ్వరం… శాసనసభ నిర్ణయం


