Singer Rohit: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. హనుమాన్, భగవంత్ కేసరి, బేబీతో పాటు పలు సినిమాలు అవార్డులను గెలుచుకున్నాయి. బేబీ సినిమాకుగాను బెస్ట్ మేల్ సింగర్‌గా తెలుగు కుర్రాడు పీవీఎస్ఎన్ రోహిత్ నేషనల్ అవార్డ్ దక్కించుకున్నాడు. బేబీ సినిమాలోని ప్రేమిస్తున్నా పాటకు గాను రోహిత్‌కు అవార్డు సొంతమైంది. నేషనల్ అవార్డు వచ్చి వారం కూడా కాకముందే మరో గుడ్‌న్యూస్ వినిపించాడు రోహిత్. తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశాడు.
ప్రేమ వివాహం…
సింగర్ రోహిత్‌కు కాబోయే భార్య పేరు శ్రేయ. డాక్టర్‌గా పనిచేస్తుందట. చాలా రోజులుగా రోహిత్, శ్రేయ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలిసింది. రోహిత్, శ్రేయ నిశ్చితార్థం కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగిందట. రోహిత్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు సింగర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తొందరలోనే తమ పెళ్లి కబురును ఈ జంట వినిపించబోతున్నట్లు తెలిసింది.
Also Read – Intel CEO vs Trump : రాజీనామాపై స్పందించిన ఇంటెల్ సీఈవో.. ఏమన్నారంటే!
ఇండియన్ ఐడల్ షో…
ఇండియన్ ఐడల్ షో ద్వారా రోహిత్ లోని టాలెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ సింగింగ్ రియాలిటీ షో సీజన్ 9లో మరో తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్‌తో కలిసి పీవీఎస్ఎన్ రోహిత్ ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ తెలుగు సింగర్లు ఇద్దరు ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్‌లో రేవంత్ విన్నర్‌గా నిలవగా… రోహిత్ సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
హరిహరవీరమల్లు, జైలర్…
బేబీ కంటే ముందు తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడాడు రోహిత్. కొండపొలం, జైలర్, హరిహరవీరమల్లు, శశివదనేతో పాటు పలు తెలుగు సినిమాల్లో తన పాటలతో మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాడు రోహిత్.
రెండు అవార్డులు…
బేబీ సినిమాకుగాను బెస్ట్ సింగర్‌గా రోహిత్‌తో పాటు బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సాయిరాజేష్‌కు నేషనల్ అవార్డ్ దక్కింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.
Also Read – RBI: రూ.500 నోటు రద్దు అవుతుందా..?


