Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభThe Paradise First Look: ‘జడల్‌’గా నేచురల్ స్టార్.. ‘ది ప్యారడైజ్‌’.. ఇప్పటి వరకు చూడని...

The Paradise First Look: ‘జడల్‌’గా నేచురల్ స్టార్.. ‘ది ప్యారడైజ్‌’.. ఇప్పటి వరకు చూడని సరికొత్త ఫస్ట్ లుక్‌

Natural Star Nani Look in The Paradise: నేచురల్ నాని కెరీర్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల తనపై ఉన్న నమ్మకాన్ని నిరూపించుకున్న సినిమా ఇది. ఈ మూవీ తర్వాత మరోసారి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్.. ‘ది ప్యారడైజ్’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వారి తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్‌’ (The paradise) ఒక విభిన్న కథాంశంతో రాబోతుందని సినిమా అనౌన్స్‌మెంట్ రోజున విడుదల చేసిన గ్లింప్స్‌తోనే క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంపై అప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ తాజాగా నాని పాత్ర పేరును వెల్లడిస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

- Advertisement -

‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో నాని ‘జడల్‌’ (Jadal) అనే విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. నాని ‘జడల్‌’ లుక్‌ వెనుక ఒక ఎమోషనల్ కథ ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో స్పష్టతనిచ్చారు. ‘నాని జడల వెనక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ భావోద్వేగం దాగి ఉంది. నా చిన్నతనంలో మా అమ్మ నాకు అలానే జడలు వేసేది. ఐదోతరగతి వరకు జడలు వేసి స్కూల్‌కు పంపేది. ఈ లుక్‌ సినిమా కథకు ఎలా కనెక్ట్‌ అవుతుందని మాత్రం ఇప్పుడే చెప్పను’ అని డైరెక్టర్ గతంలోనే తెలియజేశారు.

Also Read – Sreeleela: ఫ్లాపులున్నా శ్రీలీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదుగా – కోలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్ – స్టార్ హీరోతో రొమాన్స్‌!

డైెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పర్సనల్ టచ్ కూడా మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, ఈ చిత్రంలో తిరుగుబాటు (Rebellion), నాయకత్వం (Leadership) వంటి అంశాలతో పాటు తల్లీకొడుకుల అనుబంధం (Mother son bond) కూడా కథకు కీలకంగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘ది ప్యారడైజ్‌’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో సహా మొత్తం 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది నాని కెరీర్‌లో మరో మైల్గా నిలిచే అవకాశం ఉంది. ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ఈ విభిన్నమైన కథా చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read – Bridge collapses in Mulugu: ములుగులో కుప్పకూలిన వంతెన: వరంగల్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad