Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభNayan: కాస్టింగ్ కౌచ్ బాధలు పడ్డా.. నయనతార షాకింగ్ కామెంట్స్

Nayan: కాస్టింగ్ కౌచ్ బాధలు పడ్డా.. నయనతార షాకింగ్ కామెంట్స్

అవును..నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధలు పడ్డాను..కానీ కెరీర్ తొలి రోజుల్లో ఇవన్నీ తప్పలేదు..కానీ నేను నాపై ఆత్మవిశ్వాసం ఉంచి వీటన్నింటిన నుంచీ తప్పించుకున్నానని లేడీ సూపర్ స్టార్ నయన తార తాజాగా వివరించారు. కొన్ని ఫేవర్లు చేయాలంటూ ఇండస్ట్రీలో తనను కొందరు అడిగారని కానీ తాను వాటిని చాలా ధైర్యంగా తిప్పి కొట్టినట్టు నయన్ చెప్పారు.

- Advertisement -

ప్రస్తుతం ఇండియాలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ హీరోగా వస్తున్న ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఎప్పుడూ మాట్లాడని కొన్ని విషయాలను ఆమె వివరించారు.

విజయవంతమైన మహిళలపై ట్రోలింగ్, కామెంట్స్ లాంటి రాళ్లు వేయటం చాలా సహజమని గతంలోనూ ఆమె వ్యాఖ్యానించారు. మగవాళ్ల కంటే మహిళలు 50 రెట్లు ఎక్కువ కష్టపడతారని నయన్ చెప్పుకురావటం చూస్తుంటే ఆమెలోని ఫెమినిస్టు మరోమారు బయటికి వచ్చినట్టు కనిపిస్తోంది. అన్నట్టు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య కాలంలో ఈమె కేరాఫ్ గా మారారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News