Nayanthara: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్పెషల్ అప్‌డేట్…
బుధవారం మన శంకరవరప్రసాద్ గారు నుంచి స్పెషల్ అప్‌డేట్ వచ్చేసింది. నయనతార ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో నయనతార.. శశిరేఖ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. చీరకట్టులో చేతిలో గొడుగు పట్టుకొని స్మైలింగ్ లుక్‌తో ఈ పోస్టర్‌లో నయనతార ఆకట్టుకుంటోంది. నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దసరా రోజు కూడా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను రివీల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read- OG Movie: 250 కోట్ల క్లబ్‌లోకి ఓజీ – బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
వెంకటేష్ జాయిన్…
ఇటీవల చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 20 నుంచి మొదలయ్యే నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ జాయిన్ కాబోతున్నారు. నవంబర్‌లో చిరంజీవి, వెంకటేష్‌లపై చిత్రీకరించే సాంగ్‌తో షూటింగ్ మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న మూడో మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలిసి సైరా నరసింహారెడ్డి, గాఢ్‌ఫాదర్ సినిమాలు చేశారు.
ఆరు సినిమాలు…
సంక్రాంతికి చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో పాటు ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో పాటు దళపతి విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కూడా సంక్రాంతి రేసులో ఉన్నట్లు టాక్. ఈ ఆరు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.
విశ్వంభర…
మన శంకరవరప్రసాద్ గారు తర్వాత డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. దసరా రోజున ఈ మూవీ లాంఛ్ కానున్నట్లు సమాచారం. అలాగే చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర షూటింగ్ పూర్తయ్యింది. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2025లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది.
Introducing the magnificent #Nayanthara as ‘SASIREKHA’ from #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥
Meet her tomorrow with a special surprise on the auspicious occasion of Vijayadasami 🤩 #ChiruAnil ~ #MSG Sankranthi 2026 🔥
Megastar @KChiruTweets @AnilRavipudi @CatherineTresa1… pic.twitter.com/8lQTpOLGBy
— Shine Screens (@Shine_Screens) October 1, 2025


