Nayanthara: నయనతారతో సినిమా అంటే కేవలం యాక్టింగ్ వరకే. ప్రమోషన్స్‌లో నయన్ అస్సలు కనిపించదు. ప్రీ రిలీజ్‌లు, టీజర్, ట్రైలర్ లాంఛ్‌లలో నయనతార కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. సోషల్ మీడియాలో కూడా తాను నటించిన సినిమాలకు సంబంధించి ఎలాంటి ట్వీట్స్, పోస్ట్‌లు పెట్టదు. స్టార్ హీరోల సినిమాలైనా ఈ రూల్‌ను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. తాను నిర్మించిన సొంత సినిమాల ప్రమోషన్స్ విషయంలో నయన్ కాంప్రమైజ్ కాలేదు. తన సినిమాలే కాదు.. ఇతర నాయకానాయికలు నటించిన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనడం, పాటలు, ప్రచార చిత్రాలు రిలీజ్ చేయడం ఎప్పుడూ చేయలేదు.
ఫస్ట్ టైమ్…
తెలుసు కదా మూవీ కోసం ఫస్ట్ టైమ్ నయనతార తన రూల్‌ను పక్కనపెట్టింది. ఈ సినిమాలోని సొగసు చూడతరమా అనే పాటను మంగళవారం రిలీజ్ చేయబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. నయనతార సాంగ్ రిలీజ్ చేయడం ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. నయనతారలో ఇంత మార్పు ఎప్పుడు వచ్చిందని అంటున్నారు. ఇతర యాక్టర్లు నటించిన సినిమాలను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం మంచి విషయమేనని అంటున్నారు.
Also Read- Tamannaah Bhatia: ఐటెం సాంగ్ లో ఇన్నర్ వేర్ కనిపించేలా డ్రెస్సింగ్.. మిల్క్ బ్యూటీపై విమర్శలు..
క్రెడిట్ అనిల్ రావిపూడిదే…
ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అనిల్ రావిపూడికే దక్కుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని నెలల క్రితం రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోలో నయనతార కనిపించింది. చిరంజీవి కోసమే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నదని అనుకున్నారు. కానీ తెలుసు కదా సాంగ్ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చి సినిమాల ప్రమోషన్స్ విషయంలో తాను మారిపోయినట్లు చెప్పేసింది నయనతార.
సంక్రాంతికి రిలీజ్…
మన శంకర వరప్రసాద్‌గారు ప్రమోషన్స్‌లో నయనతార అగ్రెసివ్‌గా పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రిలీజ్‌కు సిద్ధం…
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది నయనతార. కన్నడంలో కేజీఎఫ్ హీరో యశ్‌తో టాక్సిక్ సినిమా చేస్తోంది. తమిళంలో మూక్కుత్తి అమ్మన్ 2, మంగాట్టితోపాటు మరో మూడు సినిమాలు చేస్తోంది. మలయాళంలో నయన్ హీరోయిన్‌గా నటించిన డియర్ స్టూడెంట్స్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.


