Nayanthara Divorce: ఈ తరంలో విడాకులు అనేది కామన్ అయిపోయింది. అది సినిమా ఇండస్ట్రీలో తరచూ విడాకుల వార్తలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు రిలేషన్‌లో ఉన్న వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. లవ్ తో పాటు బ్రేకప్ విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఎంతోమందితో రిలేషన్ తర్వాత చివరిగా హీరోయిన్ నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు పేరెంట్స్ గా మారారు.
అయితే రీసెంట్‌గా వీరిద్దరి బంధానికి బ్రేకులు పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఇరువురు సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. అయితే తాజాగా నయనతార ఆ వార్తలపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
హీరోయిన్ నయనతార.. ఆమె భర్త నేలపై ఒకరిపై ఒకరు పడుకొని.. “మా గురించి కొన్ని పనికిరాని వార్తలను చూస్తున్నపుడు మా రియాక్షన్ ఇలానే ఉంటుంద”ని నయనతార పోస్ట్ పెట్టింది. ఒక్క ఫొటోతో విడాకుల వార్తలకు ఆమె చెక్ పెట్టినట్లు అయ్యింది.
నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. రెగ్యులర్‌గా ఆమె సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుంది. కానీ, ఈ చిత్రానికి ఆమె ముందు నుంచే ప్రమోషన్స్‌లో పొల్గొనడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.


