Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభNeha Chowdary : పెళ్లిపీటలెక్కబోతున్న బిగ్‌బాస్‌ భామ.. వరుడు ఎవరో తెలుసా??

Neha Chowdary : పెళ్లిపీటలెక్కబోతున్న బిగ్‌బాస్‌ భామ.. వరుడు ఎవరో తెలుసా??

- Advertisement -

Neha Chowdary : స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లో నేషనల్ లెవల్ పథకాలు సాధించిన నేహా చౌదరి ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి చాలా తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. తెలుగు స్పోర్ట్స్ కి యాంకరింగ్ చేయాలంటే నేహా పేరే గుర్తొస్తుంది అందరికి. IPLలో యాంకరింగ్ చేసి మరింత పాపులర్ అయింది. పలు టీవీ షోలకి కూడా యాంకరింగ్ చేసింది ఈ భామ.

ఇటీవల తెలుగు బిగ్ బాస్ లో కూడా పాల్గొని త్వరగానే బయటకి వచ్చేసింది నేహా. ఎప్పట్నుంచో నేహా చౌదరి పెళ్లి గురించి అడుగుతున్నా ఇప్పుడే కాదు అంటూ పెళ్లిని పక్కన పెట్టేసింది. ఇటీవల బిగ్ బాస్ లో కూడా పెళ్లి గురించి అడిగితే బిగ్ బాస్ నుంచి బయటకి వెళ్ళాక చేసుకుంటాను అని తెలిపింది. అన్నట్టే నేహా తాజాగా తన పెళ్లి కబురు చెప్పింది.

తన సోషల్ మీడియాలో నేహా తన ఫోటోని షేర్ చేసి.. నేను ఎస్ చెప్పాను అని పోస్ట్ పెట్టింది. అలాగే తన తోటి ఆర్టిస్టులతో కలిసి ఓ వీడియో చేసి తన పెళ్లి గురించి ఆ వీడియోలో తెలిపింది నేహా. నా పెళ్లి గోల మొదలైంది అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు, ఆ అబ్బాయి పేరు అనిల్ అని, ఆరడుగులు ఉంటాడని, తన ఇంజనీరింగ్ క్లాస్మెట్ అని తెలిపింది. దీంతో నేహా అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే ఇంతకీ ఆ అనిల్ ఎవరన్నది మాత్రం చూపించలేదు నేహా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News