Neha Dhupia : బాలీవుడ్ నటి నేహా ధూపియా తన పెళ్లికి ముందే గర్భవతి కావడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు ఇటీవల ఘాటుగా సమాధానమిచ్చింది. 2018 మే 10న అంగద్ బేడీతో ఆమె పెళ్లి జరిగింది. ఆరు నెలల తర్వాత నవంబర్‌లో కుమార్తె మెహ్ర్‌కు జన్మనిచ్చింది. 2021లో కుమారుడు గురిక్ జన్మించాడు. అంగద్, నేహా కంటే మూడేళ్లు చిన్నవాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో హడావిడిగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
ALSO READ:Hero Madhavan : లేహ్‌లో చిక్కుకుపోయిన హీరో మాధవన్.. భారీ వర్షాలతో విమానాలు రద్దు!
నేహా తన కుటుంబానికి గర్భం విషయం చెప్పడం చాలా కష్టమైందని గుర్తుచేసుకుంది. “మా పెళ్లి సాధారణమైంది కాదు. గర్భవతినైన తర్వాతే పెళ్లి చేసుకున్నాం. నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ‘సరే, 72 గంటల్లో పెళ్లి చేద్దాం’ అన్నారు. 2.5 రోజుల్లోనే ముంబైలో పెళ్లి జరిగింది” అని వివరించింది. ఈ విమర్శల నుంచి పాఠం నేర్చుకుని ‘ఫ్రీడమ్ టు ఫీడ్’ అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది మదర్‌హుడ్ గురించి స్టిగ్మా లేకుండా చర్చలు జరిపేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం 45 ఏళ్ల నేహా, విమర్శలను పట్టించుకోకుండా కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఆమె ధైర్యం అభిమానులను ఆకట్టుకుంటోంది!


