Good Bad Ugly Movie: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్‌తో పాటు టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు పెద్ద షాక్ తగిలింది. అజిత్ హీరోగా నటించిన గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. ఇళయరాజా వేసిన కాపీరైట్ కేసు కారణంగానే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేసింది.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమాతోనే మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
త్రిష హీరోయిన్…
గుడ్‌బ్యాడ్ అగ్లీలో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించింది. అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ తమిళ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్‌కు భారీగా నష్టాలను మిగిల్చింది. గుడ్‌బ్యాడ్ అగ్లీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో రిలీజైంది.
Also Read – Tg Vishwa Prasad,: తేజా సజ్జాకు కాస్ట్‌లీ గిఫ్ట్ – స్టేజ్‌పైనే అనౌన్స్‌చేసిన మిరాయ్ నిర్మాత
ఇళయరాజా కేసు…
గుడ్‌బ్యాడ్ అగ్లీలో తాను మ్యూజిక్ అందించిన మూడు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన పాటలను గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమా నుంచి తొలగించడంతో పాటు ఆ సాంగ్స్ వాడినందుకు తనకు ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పిటీషన్‌లో ఇళయరాజా పేర్కొన్నారు. అంతే కాకుండా మేకర్స్ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యాయ పోరాటానికి సిద్ధం…
కాపీరైట్ కేసులో ఇళయరాజాకు అనుకూలంగా కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ సినిమా స్క్రీనింగ్‌ను తాత్కాలికంగా ఆపేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో మంగళవారం నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. కాగా పాత పాటలను రీమిక్స్ చేసేముందు మ్యూజిక్ కంపెనీల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఇళయరాజా పాటలు తీసేసి కొత్త వెర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేదంటే ఈ కాపీరైట్ కేసుపై మైత్రీ నిర్మాతలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియాలో స్ట్రీమింగ్ ఆపేసినా ఓవర్‌సీస్‌లో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే గుడ్‌బ్యాడ్ అగ్లీ అందుబాటులో ఉంది.
ఈ ఏడాది హీరోగా గుడ్‌బ్యాడ్ అగ్లీతో పాటు విదాముయార్చి సినిమాలు చేశాడు అజిత్. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
Also Read – Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. బుధవారం 10 గ్రాముల ధర ఎంతంటే..?


