Raghavendra Rao: మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఓ తెలుగు మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ డైరెక్టర్ ప్రవర్తనతో నిహారిక కొణిదెల ఇబ్బందిగా ఫీలైన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్య పర్యవేక్షణలో తెరకెక్కుతోన్న ఇరువురి భామల కౌగిలిలో మూవీ ఇటీవల హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు నిహారిక కొణిదెల ఓ గెస్ట్‌గా హాజరైంది.
Also Read – The Rajasaab: పండగకు వస్తున్నాం.. పండగ చేస్తున్నాం.. ‘ది రాజా సాబ్’ నిర్మాత ఎస్.కె.ఎన్ కామెంట్స్
ఈ లాంఛింగ్ వేడుకలో నిహారికతో మాట్లాడే క్రమంలో ఆమె నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు రాఘవేంద్రరావు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘవేంద్రరావు ప్రవర్తనతో నిహారిక ఇబ్బందిగా ఫీలైనట్లు కనిపించింది. రాఘవేంద్రరావు చేయి వదిలించుకొని ఆయన నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. ఆయన కూర్చున్న కుర్చీ వెనక్కి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రాఘవేంద్రరావుతో మాట్లాడింది. నిహారిక పట్ల రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనివారి పరిస్థితి ఇంకా ఎలా ఉండేదోనని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వయసులో ఇవేం పాడు బుద్దులు అంటూ రాఘవేంద్రరావుపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి అసభ్యకర ప్రవర్తనల వల్లే తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి భయపడుతున్నారని మరికొందరు పేర్కొన్నారు. నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
మన దరిద్రానికి వీడు పవిత్రమైన SVBC చైర్మన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి నే ఇలా చేశాడంటే ఇంక ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చే వాళ్లని వదులుతాడా pic.twitter.com/lQUGy3Nr2i
— వరదరాజ్ మన్నార్ (@VARADHA151) November 11, 2025
విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల. యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తోంది. కమిటీ కుర్రాళ్లు మూవీతో నిర్మాతగా తొలి సినిమాతోనే పెద్ద హిట్టందుకుంది. యదు వంశీ దర్శకత్వంలో పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. కమిటీ కుర్రాళ్లు తర్వాత ప్రొడ్యూసర్‌గా సంగీత్‌శోభన్, నయన్ సారికలతో రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోంది నిహారిక. మద్రాస్కరణ్ అనే తమిళ మూవీలో నిహారిక హీరోయిన్‌గా నటించింది.
Also Read – Mahesh Babu: ‘సంచారీ’ సాంగ్‌తో ఆకాశానికి ‘గ్లోబ్‌ట్రాటర్’పై హైప్


