SSMB 29: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటి వరకూ తీసిన సినిమాలలో చాలా సీన్స్ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టినవే అని ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆయన తీసే సినిమాలకి సంబంధించిన పొస్టర్, సాంగ్స్, టీజర్ లాంటివి వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వాటిని జత చేసి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇది ఆయనకి ప్రతీసారి కలిసి వచ్చిందే తప్ప సినీ ప్రముఖులెవరూ విమర్శించింది లేదు.
ఇక ఇదే క్రమంలో ఇప్పుడు కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబి 29 విషయంలోనూ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం గ్లోబ్ ట్రోటర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా పోస్టర్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పోస్టర్ చూస్తే, పృథ్విరాజ్ సుకుమారన్ నడవలేని పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతోంది.
Also Read – Rukmini Vasanth: రుక్మిణి వసంత్ పేరుతో మోసాలు – క్లారిటీ ఇచ్చిన కాంతార చాప్టర్ వన్ హీరోయిన్
గ్లోబ్ ట్రోటర్ లో పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కూర్చున్న వీల్‌ఛైర్ అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుందట. శత్రువులను చాలా సులభంగా మట్టుపెట్టగలదని తెలుస్తోంది. అయితే, ఈ తరహా పాత్ర ఇప్పటికే, హిందీలో వచ్చిన క్రిష్ 3 సినిమాలో వివేక్ ఓబెరాయ్ పాత్రను.. అలాగే, తమిళంలో సూర్య నటించిన 24 సినిమాలోని పాత్రను పోలి ఉందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి అది నిజమే అనిపిస్తున్నప్పటికీ, రాజమౌళి ఈ పాత్రను ఎలా డిజైన్ చేశాడనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలీదు.
అయితే, మహేశ్-రాజమౌళి ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోల్స్ కి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా రాజమౌళిని ట్రోల్ చేస్తూ మీ సమయం వృధా చేసుకోకండి.. గ్లోబల్ మూవీ కోసం ఎదురుచూస్తూ ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ నెల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో గ్లోబ్ ట్రోటర్ మూవీ టైటిల్ అండ్ టీజర్ ని రివీల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని రాజమౌళి బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read – Sharwanand: ఆ యాక్సిడెంట్ వల్ల శర్వానంద్ 8 నెలలు నరకం..


