Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హంగామా!

Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హంగామా!

Tollywood Heroines: ప్ర‌తి ఏడాది కొత్త హీరోయిన్స్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతూనే ఉంటారు. అయితే స్టార్స్‌గా ఎదిగేవాళ్లు చాలా త‌క్కువ మందే. ముద్దుగుమ్మల మధ్య పోటీ పెరిగిపోవటం, సక్సెస్ లేకపోవటం వంటి కారణాలతో హీరోయిన్స్‌లో ఓ స్థిర‌త్వం మ‌న‌కు క‌నిపించ‌దు. దీని వ‌ల్ల వాళ్లు త్వ‌ర‌గానే ఇండ‌స్ట్రీకి బై బై చెప్పేస్తుంటారు. దీంతో మ‌న హీరోల‌కు హీరోయిన్స్ దొర‌క్క చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇది ప్ర‌తీ ఏడాదీ జ‌రిగే తంతే. అలాగే ఈ ఏడాది కూడా ఇప్ప‌టికే చాలా మంది సొగ‌స‌రులు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్ల‌లో స‌క్సెస్ సాధించింది మాత్రం కొంద‌రే. ఇప్పుడు మ‌రికొంద‌రు బ్యూటీస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. వారెవ‌రో చూసేద్దాం…

- Advertisement -

ఈ వ‌రుస‌లో ముందుగా మ‌నం మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మ‌మితా బైజు పేరు చెప్పుకోవాలి. ప్రేమ‌లు అనే మ‌ల‌యాళ సినిమా అక్క‌డే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ సినిమా స‌క్సెస్‌లో కంటెంట్‌తో పాటు యూత్‌ను ఆక‌ట్టుకున్న మరో విష‌యం హీరోయిన్ మ‌మితా బైజు. ఇప్పుడీ అమ్మ‌డు మోస్ట్ వాంటెడ్ అయ్యింది.

Also Read – Bigg Boss Telugu 9: మహరాణి మాధురి రూల్స్.. సంజనా 2.0గా రమ్య?

భాగ్య‌శ్రీ బోర్సె మిస్ట‌ర్ బచ్చ‌న్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ అమ్మ‌డు గ్లామ‌ర్‌తో అంద‌రినీ ప‌డేసిది. దీంతో మీడియం రేంజ్ హీరోలంద‌రూ భాగ్య‌శ్రీ బోర్సె వైపే చూస్తున్నారు. ఇప్పుడీ అమ్మ‌డు రామ్‌తో ఆంధ్రా కింగ్ తాలూకా, దుల్క‌ర్ స‌ల్మాన్ చేస్తోన్న తెలుగు సినిమా కాంతతో మ‌న ముందుకు రానుంది. ఇప్పుడు ఆమెకు హిట్ అవ‌స‌రం. స‌క్సెస్ వ‌స్తే ఆమెకు మ‌రింత డిమాండ్ పెరుగుతుంద‌న‌టంలో సందేహం లేదు.

ఇదే బాట‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్న మ‌రో ఢిల్లీ భామ ఇమాన్వి స్మైల్‌. ప్ర‌భాస్‌, హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో రూపొందుతోన్న ఫౌజీ సినిమాలో ఈమె క‌థానాయిక‌. ఈ మూవీ రిలీజ్ కాకముందే అవ‌కాశాలైతే లైన్ క‌డుతున్నాయి. అలాగే క‌న్న‌డ సుంద‌రి రుక్మిణి వసంత్ కాంతార చాప్ట‌ర్‌1తో భారీ హిట్ త‌న ఖాతాలో వేసుకోక ముందే .. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. కాంతార చాప్టర్ వన్ సినిమాతో రుక్మిణి వసంత్ ఇప్పటికే నేషనల్ క్రష్‌గా మారింది.

డ్రాగ‌న్ సినిమాతో క‌యాద్ లోహార్ కూడా మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ‌గా మారింది. ఇప్పుడు ఫంకీ సినిమాలో న‌టిస్తోంది. చెన్నై బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ రాజా సాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ న‌యా హీరోయిన్స్ లంద‌రూ వ‌రుస విజయాలు సాధిస్తే.. టాలీవుడ్‌లో హీరోయిన్ల కోసం హీరోలు పడుతున్న కష్టాలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉంది.

Also Read – NTR: డబ్బింగ్ సినిమాలకు తారక్ హెల్ప్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad