గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అభిమానులకు న్యూఇయర్ ట్రీట్ ఇచ్చారు రాష్ట్ర రామ్‌చరణ్ యువత. ‘గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమా విడుదల వేళ దేశంలోనే అత్యంత భారీ కటౌట్(256 ఫీట్లు) ఏర్పాటు చేశారు. విజయవాడలోని వజ్ర గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకులు థమన్(Thaman) కూడా హాజరుకానున్నారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా భారీ కటౌట్‌కు పూలాభిషేకం చేయనున్నారు. అయితే ఈలోపే చెర్రీ కటౌట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ లుంగీ, బనియన్‌తో ఉన్న ఈ కటౌట్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మూవీ నుంచి విడులైన పాటలు, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.