Saturday, November 15, 2025
HomeTop StoriesRanbir Kapoor NHRC: వివాదంలో చిక్కుకున్న యానిమల్‌ హీరో.. NHRC నోటీసులు

Ranbir Kapoor NHRC: వివాదంలో చిక్కుకున్న యానిమల్‌ హీరో.. NHRC నోటీసులు

Ranbir Kapoor New Web Series NHRC: బాలీవుడ్ స్టార్ హీరో, రణ్‌బీర్ కపూర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌లో రణ్‌బీర్‌ ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించిన సన్నివేశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) అభ్యంతరం వ్యక్తం చేసింది. నిషేధిత వస్తువును ప్రోత్సహించేలా ఈ సన్నివేశం ఉందని, యువతపై ఇది తప్పుడు ప్రభావాన్ని చూపుతుందని ఫిర్యాదు రావడంతో NHRC చర్యలకు ఉపక్రమించింది.

- Advertisement -

ఇటీవల విడుదలైన ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌.. ప్రభుత్వం నిషేధించిన ఈ- సిగరెట్‌ తాగుతున్నట్లు కనిపిస్తారు. ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ నిషేధ చట్టం- 2019ని ఉల్లంఘించడమే కాకుండా.. ఎలాంటి హెచ్చరికలు, డిస్‌క్లెయిమర్‌, వార్నింగ్‌ లేకుండా వీడియో ఉండటంపై ముంబయిలోని వినయ్ జోషి అనే వ్యక్తి NHRC కి ఫిర్యాదు చేశారు. ఇది చట్ట ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/power-star-og-mania-everywhere/

2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం, ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, నిల్వ, పంపిణీ, ప్రకటనలు చేయడం నేరంగా పరిగణించబడుతుంది. వినయ్‌ జోషి ఫిర్యాదుపై స్పందించిన NHRC.. రణ్‌బీర్ కపూర్, వెబ్ సిరీస్ నిర్మాతలు, అలాగే నెట్‌ఫ్లిక్స్‌‌పై చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించింది. ఇలాంటి కంటెంట్‌ యువతను తప్పుదోవ పట్టించకుండా, తక్షణమే నిషేధించాలని కూడా NHRC విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad