Nidhhi Agerwal Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లుతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ జూలై 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ లుక్‌తో పాటు ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగినట్లు చెబుతోన్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ గత సినిమాల రికార్డులను హరి హర వీరమల్లు దాటేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిధి అగర్వాల్…
హరి హర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పార్ట్ 2కు సంబంధించి 20 నుంచి 30 నిమిషాల ఫుటేజ్ ఆల్రెడీ రెడీ అయ్యిందని నిధి అగర్వాల్ చెప్పింది. ఇందులో కొన్ని పవన్ కళ్యాణ్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిపింది. ఫస్ట్ పార్ట్‌కు మించి లార్జ్ స్కేల్‌లో సీక్వెల్ ఉంటుందని నిధి అగర్వాల్ అన్నది.
Also Read – Shocking Discovery: ఓ ఏడేళ్లు తెరుచుకొని ఇంట్లోకి క్రికెట్ బాల్ కోసం వెళ్తే.. ఎదురుగా ఎముకల గూడు..
ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత…
హరి హర వీరమల్లు సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్ కూడా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఆగస్ట్ నెలాఖరు నుంచి పార్ట్ 2 సెట్స్‌పైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిచేసిన వెంటనే ఈ సీక్వెల్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టనున్నట్లు చెబుతోన్నారు. పార్ట్ వన్‌లో ఉన్న యాక్టర్స్‌తో పాటు మరికొంత మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి…త్రివిక్రమ్…
హరి హర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 20న వైజాగ్‌లో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ గెస్ట్‌లుగా హాజరుకానున్నట్లు సమాచారం. మొఘల్ చక్రవర్తి అన్యాయాలను ఎదురించి పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు క్రిష్‌తో పాటు ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు. హరిహరవీరమల్లులో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. అనసూయ, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read – Katrina Kaif: నాగార్జున పాన్ ఇండియా ప్లానింగ్.. బాలీవుడ్ బ్యూటీ కంబ్యాక్!


