Nidhhi Agerwal Rple in HHVM: హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఆయన నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో రిలీజైన ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే షో పడినప్పటి నుంచి హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. చిత్ర యూనిట్ 5 ఏళ్ళ కష్టానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి తమ శ్రమ ఫలించిందని చెప్పుకుంటున్నారు.
హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఎప్పుడు ప్రెస్ మీట్స్ కి రాని పవన్ కళ్యాణ్ వీరమల్లు చిత్రాన్ని మాత్రం తన భుజాల మీద వేసుకొని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళారు. స్పెషల్ ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఇలా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సినిమాను మోశారు. ఇదంతా కేవలం చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం కోసమేనని చెప్పుకొచ్చారు పవర్ స్టార్.
Also Read – Shocking Incident: రూ. లక్ష కోసం కోడలిని అమ్మేసిన అత్తా మామలు..!..!
అయితే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటించింది. అందం, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. సాంగ్స్‌లో కూడా పవన్, నిధి కాంబినేషన్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. కానీ, ఇవ్వాల్సినంత స్క్రీన్ స్పేస్ నిధికి దర్శకుడు ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. ఆమె గత చిత్రాలలో మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. హీరోతో పాటు సమానంగా ఎక్కువ సన్నివేశాలలో, పాటల్లో నిధిని చూపించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా అయితే, ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
అయితే.. మొదటి నుంచి నిధి విషయంలో కొందరు నెగిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. నటన పరంగా ఈ బ్యూటీకి ఎక్కువగా మైనస్ మార్కులే పడ్డాయి. మిస్టర్ మజ్ను, సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ సహా తమిళంలో రెండు సినిమాలు చేసిన నిధికి యాక్టింగ్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఒక్క పూరి సినిమానే. ఇక.. తాజాగా వచ్చిన హరిహర వీరమల్లులో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉన్న సీన్స్‌లోనూ నిధి తేలిపోయిందని చెప్పుకుంటున్నారు. డాన్స్ పరంగానూ అమ్మడికి మైనస్ మార్కులే పడ్డాయి. కానీ.. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో మాత్రం తనే హైలెట్‌గా నిలిచింది. మరి, పార్ట్ 2లోనైనా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుందేమో చూడాలి.
Also Read – Today gold Rates: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం పై కాస్త తగ్గిన రేటు..!


