Nidhhi Agerwal: గ్లామర్, టాలెంట్ అన్ని ఉన్నా.. నిధి అగర్వాల్‌కు లక్ మాత్రం కలిసిరావడం లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, తన రాత మారుస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అంచనాలకు అందుకోలేక బాక్సాఫీస్ వద్దబోల్తా కొట్టింది. హరిహర వీరమల్లు కోసం దాదాపు ఐదేళ్లు ఎదురు చూసింది నిధి అగర్వాల్. ఈ సినిమా కోసం నిర్మాతలతో చేసుకున్న డీల్ కారణంగా చాలా ఆఫర్లు వదులుకుంది. ప్రమోషన్స్ విషయంలో తెగ కష్టపడింది. కానీ ఆమె కష్టానికి తగ్గ రిజల్ట్ మాత్రం రాలేదు.
స్పెషల్ సాంగ్…
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి బయటపడకముందే నిధి అగర్వాల్‌కు మరో షాక్ తగిలింది. తేజా సజ్జా లేటెస్ట్ మూవీ మిరాయ్‌లో నిధి అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ట్రైన్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో తేజ సజ్జా (Teja Sajja), నిధి అగర్వాల్‌పై భారీగా ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో తన స్టెప్పులతో నిధి అగర్వాల్ అదరగొట్టిందట. రిలీజ్‌కు ముందు షారుఖ్‌ఖాన్ దిల్ సేలోని ఛయ్యా ఛయ్యాను గుర్తుకు తెచ్చే సాంగ్ ఇదని, మిరాయ్‌కి (Mirai) మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందంటూ బజ్ వచ్చింది.
Also Read- Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసులో నాపై తప్పుడు ప్రచారం చేశారు.. మీడియాపై మంచు లక్ష్మి ఫైర్..!
హిట్టైనా చెప్పుకోలేని పరిస్థితి…
రిలీజ్ తర్వాత థియేటర్లలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ కనిపించలేదు. మిరాయ్ సినిమా రన్ టైమ్ ఎక్కువ కావడంతో పాటు స్టోరీ ఫ్లోకు అడ్డుగా ఉన్నాయనే ఆలోచనతో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్‌తో పాటు వైబ్ ఉంది అనే సాంగ్‌ను ఎడిటింగ్‌లో లేపేశారు. స్పెషల్ సాంగ్ సినిమాలో కనిపించకపోవడంతో నిధి అగర్వాల్ ఫ్యాన్స్ డిజపాయింట్ అయ్యారు. సినిమా హిట్టైనా చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిధి ఇప్పుడు మిరాయ్ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.
ప్రభాస్ రాజాసాబ్‌పైనే…
ఇక నిధి అగర్వాల్ ఆశలు మొత్తం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ది రాజాసాబ్ (The Raja Saab) పైనే ఉన్నాయి. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్‌తో పాటు మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. రాజాసాబ్‌పై ఉన్న బజ్ చూస్తుంటే హిట్టు కొట్టాలనే నిధి అగర్వాల్ కల ఈ సినిమాతో తీరనున్నట్లు కనిపిస్తోంది.
Also Read- Balakrishna Movies : ఫ్యాన్స్‌కి బాలకృష్ణ గుడ్ న్యూస్.. ఏకంగా రెండు సినిమాలతో సందడి


