Nidhhi Agerwal: బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా పెద్ద హాట్ టాపిక్ అవుతుంటుంది. ప్రస్తుతం ఆయన ఓజీ సక్సెస్ మూడ్‌లో ఉండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ భారీ హిట్ సాధించి 300 కోట్ల మార్క్ దిశగా ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. అసలు ఓజీ కథను సుజీత్ నాకు చెప్పలేదని ఓ టాప్ సీక్రెట్‌ని బయటపెట్టారు. ఇంతకముందే, సుజీత్ సీన్‌ని క్లియర్ గా చెప్పడు. అక్కడ అక్కడ చిన్న చిన్న షాట్స్‌గా చెప్తాడు. కానీ, తీసేటప్పుడు మాత్రం చాలా డీటైలింగ్ ఉంటుందని పవన్ కితాబిచ్చారు. ఇక సుజీత్, థమన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని కూడా ఇప్పటికే, చాలాసార్లు చెప్పడం గొప్ప విషయం.
Also Read- Kantara Chapter 1: కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ – తెలుగులో ఎపిక్ రికార్డ్
పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి పనిచేసిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ల గురించి మాట్లాడటం అంటే అది ఓజీ ప్రాజెక్ట్‌కి రిలవెంట్ అనుకోవచ్చు. కానీ, గత చిత్రం హరి హర వీరమల్లు సినిమా గురించి.. ఇందులో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్ గురించి ఓజీ ఈవెంట్‌లో చర్చించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, పవన్ మాటలు విన్న నిధి అగర్వాల్ ఆనందంతో ఉప్పొంగిపోయి ఎక్స్(X) లో ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వీరమల్లు సినిమాకి నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నారని, అది చూసే నేను ప్రమోషన్స్‌కి వచ్చానని అన్న పవర్ స్టార్, అలాగే.. ఇప్పుడు ఓజీ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చినట్టుగా తెలిపారు. ఇలా, ప్రత్యేకంగా తన పేరును ప్రస్తావించినందుకు నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఆయనకి థాంక్స్ చెప్పింది. కాగా, నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
Also Read- Bigg Boss Promo Today: నడుము గిల్లారని ఫీలైన ఇమ్మూ.. ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించి తనూజ


