సోషల్ మీడియా పుణ్యమా అని నిజమైన వార్త ఏదో, నకిలి వార్త ఏదో గుర్తించడం కాస్త కష్టంగా మారింది. మిగతా వార్తలను గుర్తించడం ఎలా ఉన్నా.. సినీతారల గురించి వచ్చే వార్తల్లో ఏదీ నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. స్వయంగా సదరు సినీతార ఆ వార్త గురించి స్పందిస్తే గానీ విషయం అర్థం కావడం లేదు. హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రెగ్నెంట్ అంటూ గత కొద్ది రోజులుగా పలు వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్త ఆమె వద్దకి కూడా చేరడంతో.. ‘అవునా నాకు సంబంధించిన ఇంత పెద్ద వార్త నిజంగా నాకు తెలియదే’ అంటూ కాస్త సెటైరికల్‌గానే స్పందించింది.
కొన్నేళ్ల పాటు ప్రేమపక్షులుగా విహరించిన కోలీవుడ్ నటులు నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఇటీవల నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తాను ప్రెగ్నెంట్ కాదంటూ నిక్కీ గల్రానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అందరికి చెప్పింది. అలాంటిది ఏదైనా ఉంటే తానే ఆ విషయాన్ని స్వయంగా చెబుతానంది.
“నాకు సంబంధించిన ఇంత పెద్ద వార్త నిజంగా నాకు తెలియదు. కొద్ది మంది నేను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే నా డెలివరీ డేట్ కూడా కాస్త చెప్పండి” అంటూ నిక్కీ గల్రానీ నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేసింది. ‘నేను ప్రెగ్నెంట్ కాదు. భవిష్యత్తులో అలాంటిది ఏదైనా ఉంటే మొదటగా నేనే మీకు తెలియజేస్తాను. దయచేసి రూమర్లను నమ్మకండి’ అని విజ్ఞప్తి చేసింది.
నిక్కీ గల్రానీ స్పందించడంతో ఆమె ప్రెగ్నెంట్ రూమర్లకు చెక్ పడినటైంది.