Nishvika Naidu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన సినిమా గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడింది. సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇది ఫ్యాన్స్‌ని తెగ ఇబ్బంది పెడుతోందనే చెప్పాలి. విశ్వంభర చిత్రం చుట్టూ విడుదల తేదీకి సంబంధించి అంతుచిక్కని ప్రశ్నలు తిరుగుతున్నాయి. అయితే, సినిమాలోని ఒకే ఒక్క బ్యాలెన్స్డ్ ఐటెం సాంగ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లు లేటెస్ట్ అప్‌డేట్. ఈ పాట కోసం శాండల్‌వుడ్ భామ నిష్విక నాయుడును ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నిష్విక నాయుడు తెలుగు ఆడియెన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోయినా, కన్నడ సినిమాలు చూసే వారికి గుర్తుంటుందని పేర్కొనబడింది. 2018లో బిచ్చగాడు కన్నడ రీమేక్ ‘అమ్మ ఐ లవ్ యూ’తో పరిచయమైన నిష్విక, ఇప్పటివరకు తొమ్మిదికి పైగా సినిమాలు చేసింది. గత ఏడాది శివరాజ్ కుమార్, ప్రభుదేవాలతో కలిసి ‘కరటక దమనక’లో నటించింది. ఈమె కుటుంబ మూలాలు తెలుగులోనే ఉన్నా, పుట్టి పెరిగింది, చదివింది అంతా బెంగళూరులోనే అని తెలుస్తోంది. పెద్దగా పాపులారిటీ లేని నిష్వికను ఎంచుకోవడం వెనుక దర్శకుడు వశిష్ఠ స్ట్రాటజీ ఏమిటో ఆ సాంగ్ చూసే వరకు అర్థం కాదని చెప్పబడింది.
విశ్వంభరలో ఐటెం పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేస్తున్నాడు. ఇది అధికారికంగా చెప్పకపోయినా టీమ్ దాచిపెడితే లీకైపోయిందని సమాచారం. అయినప్పటికీ, యువి క్రియేషన్స్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికీ విపరీతమైన ఆలస్యానికి గురైన విశ్వంభర విడుదల వ్యవహారం త్వరలోనే కొలిక్కి రావోచ్చని ప్రచారం జరుగుతోంది. ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్‌కు, శాటిలైట్ హక్కులు జీ ఛానల్‌కు ఇచ్చారనే ప్రచారం ఉన్నా, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. జూలై నెలలో ఈ మూవీ రిలీజ్ కాదని క్లారిటీ రావటంతో ఇక ఆగస్ట్‌లోనైనా రిలీజ్ అవుతుందా అని అభిమానులు సహా అందరూ ఎదురు చూస్తున్నారు.
ఆగస్టు మొదటి రెండు వారాల్లో కింగ్‌డమ్, వార్ 2, కూలీ వంటి పెద్ద చిత్రాలు ఉండగా, చివరి వారంలో రవితేజ మాస్ జాతర ఉంది. ఈ సినిమాలతో మెగా మూవీ పోటీపడటం అనుమానమే. ఒకవేళ ఆగస్టు మిస్ అయితే, మళ్ళీ సెప్టెంబర్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. సెప్టెంబర్ కూడా ఖాళీగా లేదు, మిరాయ్, ఓజి, అఖండ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలు అదే నెలలో రాబోతున్నాయి. అనిల్ రావిపూడి మెగా 157ని సంక్రాంతికి బరిలో దింపాలని డిసైడ్ అయిన మాట వెనక్కు తీసుకునేలా లేడు. ఇదే జరిగితే, విశ్వంభర ఏ నెలలో వస్తుందో, అసలు ఈ ఏడాది విడుదల అవుతుందో లేదో అంతుచిక్కని ప్రశ్నగా నిలుస్తోంది.