నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మూవీ యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్‌లో డ్యాన్స్ వేయడంతో పాటు తెలుగులో మాట్లాడి సందడి చేశాడు. అదిదా సర్‌ప్రైజ్ పాటకు నితిన్, శ్రీలీల, కేతికశర్మలతో కలిసి హుక్ స్టెప్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయ విధితమే.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు వార్నర్‌కు హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కలిసి తెలుగు నేర్పిస్తున్న వీడియోను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో ‘వార్నర్ భాయ్.. నువ్వు స్టేజి మీదకు వచ్చిన తర్వాత నితిన్ అంటే నాకు పిచ్చి అని చెప్పాలి’ అంటూ నితిన్ చెప్పాడు. దానికి డేవిడ్ కూడా నాకు నితిన్ అంటే పిచ్చి అంటూ సమాధానం ఇస్తాడు. శ్రీలీల కూడా.. ‘నాకు శ్రీలీల తప్ప ఎవరూ నచ్చరు’ అని చెప్పగా.. వార్నర్ కూడా అదే చెప్పాడు. ఇలా ఫన్నీగా ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. కాగా ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది.