Nithiin: హీరో నితిన్ హిట్టు కొట్టి ఐదేళ్లు దాటిపోయింది. 2020 వచ్చిన భీష్మ బ్లాక్‌బస్టర్ తర్వాత నితిన్ చేసిన ఏడు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రాబిన్‌హుడ్‌తో పాటు తమ్ముడు సినిమాల్లో నటించాడు నితిన్. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలు నిర్మాతలకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.
ఈ డిజాస్టర్స్‌తో నెక్స్ట్ సినిమా విషయంలో డైలమాలో పడిపోయాడు నితిన్. బలగం వేణు ఎల్లమ్మతో పాటు డైరెక్టర్లు శ్రీనువైట్ల, విక్రమ్ కే కుమార్ లతో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టాడు నితిన్. కొత్త కథల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో నితిన్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు చెప్పిన కథ నితిన్‌కు తెగ నచ్చేసినట్లు టాక్. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. రెండు రోల్స్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో సాగుతాయని అంటున్నారు. కమర్షియల్‌గా సినిమా అటు ఇటు అయినా నటుడిగా సంతృప్తి మిగులుతుందనే ఈ ప్రయోగానికి నితిన్ సిద్ధపడినట్లు టాక్ వినిపిస్తోంది.
నితిన్, వీఐ ఆనంద్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. ఈ సినిమా కోసం నితిన్ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సైలెంట్‌గా సినిమాను లాంఛ్ చేసి షూటింగ్‌ను ఫాస్ట్‌గా ఫినిష్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.
డైరెక్టర్‌గా వీఐ ఆనంద్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ లేకపోయినా మంచి సినిమాలు చేస్తాడనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం, డిస్కోరాజాతో పాటు గత ఏడాది రిలీజైన ఊరు పేరు భైరవకోన డిఫరెంట్ అటెంప్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పించాయి. నితిన్‌తో సినిమా టిపికల్ స్క్రీన్‌ప్లేతో వీఐ ఆనంద్ స్టైల్‌లోనే సాగనున్నట్లు సమాచారం.
నితిన్ రిస్క్‌కు తగ్గ రిజల్ట్ దొరుకుతుందా? ఈ సినిమాతోనైనా అతడు హిట్టు బాట పడతాడా అన్నది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇటీవల వచ్చిన తెలుసు కదా మూవీలో కథానాయకుడిగా ఫస్ట్ ఛాయిస్ నితిన్ అంట. ఈ విషయాన్ని సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా వెల్లడించాడు. కథ తనకు సూటవ్వదని భావించిన నితిన్… సిద్ధు జొన్నలగడ్డ పేరు రికమండ్ చేశాడట. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
Also Read – Suriya: కామన్ మ్యాన్‌గా మొదలై ఈ స్టేజ్‌కి ఎదగటం మామూలు విషయం కాదు: హీరో సూర్య


