Thammudu Movie: నితిన్ తమ్ముడు మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ సినిమాల కంటే తక్కువ వసూళ్లతో నిరాశపరిచింది. ఫస్ట్ వీకెండ్‌లోనే థియేటర్లలో కనిపించకుండాపోయిన ఈ మూవీ నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
రిజల్ట్ ఎఫెక్ట్…
ఈ రిజల్ట్ ఎఫెక్ట్‌తో తమ్ముడు మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే నితిన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. జూలై మూడో వారంలో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
Also Read – US Visa Delay : మరీ ఇంత ఆలస్యమా..1.13 కోట్ల పెండింగ్ కేసులు
ఇరవై కోట్లకుపైనే..
తమ్ముడు మూవీ ఓటీటీ హక్కులను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకున్నది. తెలుగులో నితిన్, దిల్‌రాజులకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ కోసం ఆమెజాన్ ప్రైమ్ ఇరవై కోట్లకుపైనే వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత తమ్ముడు మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా తొలుత నిర్మాతలతో అమెజాన్ ప్రైమ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఇరవై ఐదు కోట్లు టార్గెట్…
ఇరవై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన తమ్ముడు మూవీ ఐదు రోజుల్లో మూడున్నర కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా కోటి వరకు వసూళ్లను దక్కించుకున్నది. నెగెటివ్ టాక్ కారణంగా రోజురోజుకు వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. మంగళవారం రోజు పన్నెండు లక్షలు, బుధవారం రోజు పది లక్షలు వరకు తమ్ముడు మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తమ్ముడు సినిమా దిల్‌రాజుకు గట్టిగానే నష్టాలను మిగల్చనున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read – The Paradise: నాని పారడైజ్‌లో విలన్‌గా మోహన్‌బాబు – లీకైన షూటింగ్ ఫొటోలు
కాంతార ఫేమ్…
అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు.


