Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNITHIN: నితిన్‌కు పెద్ద దెబ్బ.. ఫ్లాపుల వల్ల 3 మంచి సినిమాలు పోయాయి!

NITHIN: నితిన్‌కు పెద్ద దెబ్బ.. ఫ్లాపుల వల్ల 3 మంచి సినిమాలు పోయాయి!

Nithin: హీరో నితిన్ కి ఈ మధ్య అస్సలు కలిసి రావట్లేదు. ఆయన చేసిన రెండు పెద్ద సినిమాలు (రాబిన్‌హుడ్, తమ్ముడు) దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అందుకే నితిన్ ఇప్పుడు గట్టి హిట్ కొట్టాలని బ్రేక్ తీసుకున్నారు. అయితే, ఈ గ్యాప్‌లోనే నితిన్ మూడు ముఖ్యమైన సినిమాలను పోగొట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

1. దిల్ రాజుతో ‘ఎల్లమ్మ’ మిస్

‘బలగం’ సినిమా తీసిన వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయాలని నితిన్ చాలా రోజులు అనుకున్నారు.
దిల్ రాజు తీసిన ‘తమ్ముడు’ ఫ్లాప్ కావడంతో, కారణాలు ఏంటో తెలీదు గానీ, నితిన్ ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. ఇప్పుడు ఈ ‘ఎల్లమ్మ’ సినిమాకు హీరోగా దేవి శ్రీ ప్రసాద్ (DSP) పేరు గట్టిగా వినిపిస్తోంది! ‘బలగం’ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో DSP హీరోగా పరిచయం కాబోతున్నారని తాజా వార్తలు వచ్చాయి. చాలా ఏళ్లుగా హీరోగా వస్తాడని ఎదురుచూస్తున్న DSP, నితిన్ వదులుకున్న ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారంటే ఇది నిజంగా ఊహించని మలుపే!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vetri-maran-simbu-samrajyam-vadachennai-universe/

2. శ్రీను వైట్ల సినిమా శర్వానంద్‌కి

దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన మంచి కామెడీ కథ నితిన్‌కు బాగా నచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇప్పుడు శర్వానంద్‌ చేతికి వెళ్లింది. మైత్రీ వాళ్ళు ఆ కథపై నమ్మకంతో శర్వానంద్‌తో సినిమా మొదలుపెడుతున్నారు.

3. విక్రమ్ కుమార్ సినిమా విజయ్ దేవరకొండకి

‘ఇష్క్’ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో మళ్ళీ కలిసి పనిచేయాలని నితిన్ అనుకున్నారు. ఆ సినిమాకి యూవీ క్రియేషన్స్ నిర్మాతలుగా ఉండాలి. ‘తమ్ముడు’ ఫ్లాప్ అయ్యాక, నిర్మాతలు డబ్బుల లెక్కలు సరిపోవని అనుకున్నారు. దాంతో నితిన్‌ను తప్పించి, ఇప్పుడు ఆ సినిమాను విజయ్ దేవరకొండ తో ఓకే చేశారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/complaint-at-banjara-hills-police-station-against-bigg-boss-telugu-9/

కేవలం మూడు నెలల్లో నితిన్ ఈ మూడు పెద్ద అవకాశాలను కోల్పోవడం బాధాకరం. అందుకే ఆయన ఒక కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయడానికి సైన్ చేశారు, అది త్వరలోనే మొదలవుతుంది. దాంతో పాటు, వి.ఐ. ఆనంద్ మరియు సాయి మార్తాండ్‌ లాంటి దర్శకులతో మరో రెండు సినిమాల గురించి మాట్లాడుతున్నారు. త్వరలోనే తన కొత్త సినిమాల గురించి నితిన్ ప్రకటన ఇవ్వబోతున్నారు. మరి ఈ కొత్త దర్శకులతో అయినా హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad