‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్(Nithiin) హీరోగా ‘తమ్ముడు'(Thammudu) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి లయ మరోసారి ఈ చిత్రం ద్వారా మళ్లీ తెరపై కనిపించనుండటం విశేషం. ఆమె నితిన్ అక్క పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సప్తమీ గౌడ, శ్వాసికా విజయ్, సౌరభ్ సచ్‌దేవ, వర్ష బొల్లమ్మ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ఇక ఇటీవల నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘భీష్మ’ మూవీ తర్వాత నితిన్ నటించిన సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ మూవీతోనైనా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడంతో పాటు ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
Thammudu: ఆసక్తిగా నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES