Dhansuh: ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. 2023లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాగా సార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
సార్ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ ధనుష్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి రివీల్ చేశారు. రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రవితేజతో కలిసి వెంకీ అట్లూరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సార్‌పై వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రవితేజతో..
సార్ సినిమాను రవితేజతో చేయాలనుకున్నాను. ఆయన్ని కలిసి కథ వినిపించాను. రవితేజకు కథ నచ్చింది. కానీ ఆ టైమ్‌లో రవితేజ బిజీగా ఉన్నారు. నేను ఎవరిని వెయిట్ చేయమని అనను. నువ్వు కొన్నాళ్లు వెయిట్ చేయగలనని అనుకుంటే చేయ్… ఆ తర్వాత కలిసి సినిమా చేద్దాం అని రవితేజ నాతో అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ధనుష్ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ విషయం రవితేజకు చెప్పగానే ధనుష్ మంచి యాక్టర్ అతడితోనే సినిమా చేయమని సపోర్ట్ చేశారు. అని వెంకీ అట్లూరి అన్నారు.
Also Read – Storing Eggs:కోడిగుడ్లను ఫ్రిజ్ లో పెట్టొచ్చా..లేదా…మీకు ఈ విషయం తెలుసా!
కాంబోలో సినిమా…
ఎప్పటికైనా రవితేజతో సినిమా చేస్తానని వెంకీ అట్లూరి అన్నారు. ఇప్పటికే కొన్ని ఐడియాలు షేర్ చేసుకున్నాం. నేను చెప్పిన పాయింట్ రవితేజకు నచ్చింది. తప్పకుండా మా కాంబోలో సినిమా ఉంటుంది అని వెంకీ అట్లూరి పేర్కొన్నాడు.
సూర్యతో…
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి సూర్య రీఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మాస్ జాతర…
మరోవైపు రవితేజ మాస్ జాతర సినిమాతో రైటర్ భాను భోగవరపు డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది.
Also Read – Akhanda 2: బాలయ్య సినిమా కోసం భగవద్గీత శ్లోకాలు పాడిన డా. గంగాధర శాస్త్రి!


