Mirai Movie: తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీ ఐదు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. 2025 ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మైథలాజికల్ ఎలిమెంట్స్‌కు యాక్షన్ అడ్వెంచర్ అంశాలు జోడించి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కించారు. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో తేజా సజ్జా మంచు మనోజ్… ఇద్దరి పాత్రలు పోటాపోటీగా సాగాయని అడియెన్స్ చెబుతున్నారు.
విలన్‌గా మంచు మనోజ్…
ముఖ్యంగా బ్లాక్‌స్వార్డ్ పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్‌తో మంచు మనోజ్ అదరగొట్టాడని అంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మిరాయ్‌తో పెద్ద విజయాన్ని అందుకున్నాడు మంచు మనోజ్. మిరాయ్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ప్రమోషన్స్‌లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read – Junior Movie: ఓటీటీలోకి శ్రీలీల లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ – రిలీజ్ ఎప్పుడంటే?
సందీప్ కిషన్‌ను అనుకున్నారు…
కాగా బ్లాక్‌స్వార్డ్ పాత్ర కోసం ఫస్ట్ ఛాయిస్ మంచు మనోజ్ కాదట. తొలుత ఈ విలన్ పాత్ర కోసం దర్శకనిర్మాతలు హీరో సందీప్ కిషన్‌ను తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా వెల్లడించాడు.
బ్లాక్‌స్వార్డ్ పాత్ర కోసం సందీప్‌కిషన్‌ను తీసుకోవాలని మేకర్స్ ఫిక్సయ్యారు. కానీ ఈ పాత్రకు నేను అయితేనే కరెక్ట్ అని తేజా సజ్జా అనుకున్నారు. నా పేరును దర్శకుడికి సూచించారు. తేజా సజ్జా సలహా మేరకు కార్తీక్ ఘట్టమనేని నన్ను అప్రోచ్ అయ్యాడు. అలా నేను మిరాయ్‌లోకి ఎంటరయ్యాను అని మంచు మనోజ్ పేర్కొన్నారు. సందీప్‌కిషన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం సందీప్ కిషన్ చేస్తే ఈ స్థాయిలో విలన్ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేది కాదని అంటున్నారు.
భైరవంతో రీఎంట్రీ…
మిరాయ్ కంటే ముందు రిలీజైన భైరవం మూవీతో దాదాపు ఏడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు మనోజ్. భైరవంలోనూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు. తమిళ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా రూపొందిన భైరవం కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
మిరాయ్ సక్సెస్‌తో మంచు మనోజ్ మళ్లీ బిజీ అయ్యాడు. డేవిడ్ రెడ్డి, వాటి ది ఫిష్‌తో పాటు మరొకొన్ని సినిమాలు చేస్తున్నాడు.
Also Read – OG: హైప్ తగ్గించుకోండి.. అవన్నీ ఉండవు


