Saturday, November 15, 2025
HomeTop StoriesThama Movie: థామాలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ ర‌ష్మిక కాదు- అస‌లేం జ‌రిగిందంటే?

Thama Movie: థామాలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ ర‌ష్మిక కాదు- అస‌లేం జ‌రిగిందంటే?

Thama Movie: థామా మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ జాన‌ర్‌ను ట‌చ్ చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ బాలీవుడ్ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 21న రిలీజ్ కాబోతుంది. టీజ‌ర్, గ్లింప్స్‌తో థామా బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇటీవ‌ల థామాలోని తుమ్ మేరే నా హుయే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్‌లో అందాలను ఆర‌బోసింది ర‌ష్మిక మంద‌న్న‌. బోల్డ్‌గా క‌నిపించింది. ఆయుష్మాన్ ఖురానా, ర‌ష్మిక కెమిస్ట్రీ ఈ పాట‌కు హైలైట్‌గా నిలిచింది. స్టెప్పుల‌ విష‌యంలోనూ ర‌ష్మిక ఇర‌గ‌దీసింది. మూడు రోజుల్లోనే 30 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న తుమ్ మేరే సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.

- Advertisement -

500 కోట్ల క‌లెక్ష‌న్స్‌…
థామా కంటే ముందు మాడాక్ హార‌ర్ యూనివ‌ర్స్‌లో వ‌చ్చిన స్త్రీ 2, ముంజ్యా బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేశాయి. 500 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్నాయి. థామా కూడా ఈ లిస్ట్‌లో చేర‌నుంద‌ని గ‌ట్టిగా టాక్ వినిపిస్తుంది. ర‌ష్మిక మంద‌న్న ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌చ్చిన‌డిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

Also Read- Manushi Chhillar: పరువాలతో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

ది వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్‌…
అయితే థామా మూవీలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ ర‌ష్మిక మంద‌న్న కాదు. స‌మంత అనుకున్నారట‌. కానీ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల స‌మంత త‌ప్పుకోవ‌డంతో ర‌ష్మిక మంద‌న్నకు ఈ హార‌ర్ మూవీలో ఛాన్స్ ద‌క్కింది. స‌మంత హీరోయిన్‌గా ది వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్ పేరుతో మాడాక్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను అనౌన్స్‌చేసింది. కానీ మ‌యోసైటిస్ కార‌ణంగా సినిమాల‌కు బ్రేక్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మంత ది వాంపైర్స్ ఆఫ్ విజ‌య్‌న‌గ‌ర్ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఈ హార‌ర్ కామెడీ సినిమా కోసం నిర్మాత‌ల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా వెన‌క్కి ఇచ్చేసింది. స‌మంత స్థానంలో ర‌ష్మిక మంద‌న్న‌ను హీరోయిన్‌గా ఎంపిక‌చేశారు మేక‌ర్స్‌. సినిమా టైటిల్‌ను కూడా థామాగా మార్చేశారు. థామా మూవీ స‌మంత చేసి ఉంటే ఆమె బాలీవుడ్ కెరీర్‌కు ఈ హార‌ర్ మూవీ చాలా ఉప‌యోగ‌ప‌డేంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

యానిమ‌ల్‌…ఛావా…
ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్న ఈ హార‌ర్ కామెడీ మూవీలో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ముంజ్యా ఫేమ్ ఆదిత్య స‌ర్పోట్ద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీస్ యానిమ‌ల్‌, ఛావా ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఈ విజ‌యాల‌తో బాలీవుడ్‌లోనూ ల‌క్కీస్టార్‌గా మారిపోయింది ర‌ష్మిక‌. మ‌రోవైపు తెలుగులో గ‌త ఏడాది ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన పుష్ప 2 ఏకంగా 1700 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ప్ర‌స్తుతం తెలుగులో ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌, మైసా సినిమాలు చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌.

Also Read- Kantara Chapter 1: కాంతార చాప్ట‌ర్ వ‌న్ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌ – తెలుగులో ఎపిక్ రికార్డ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad