Weekend Movies: ఈ వారం సినీ ప్రియులకి ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి! నవంబర్ 14వ తేదీన థియేటర్లలో, ఓటీటీలలో కలిపి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం రండి!
నాగార్జున ‘శివ’
నవంబర్ 14న థియేటర్లలో వస్తున్న సినిమాలలో మోస్ట్ హైప్ ‘శివ’ సినిమా రీ రిలీజ్ గురించే. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో కింగ్ నాగార్జున నటించిన ఈ కల్ట్ క్లాసిక్.. మళ్లీ బిగ్ స్క్రీన్‌పై వస్తుండటంతో మాస్ ఆడియన్స్ ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌లో ఉన్నారు. మరి చూడాలి ఈ రీ రిలీజ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోందో!
ALSO READ: Bison: ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి.. రిలీజ్ డేట్ ఫిక్స్!
దుల్కర్ ‘కాంత’
అదే రోజు రిలీజ్ అవుతున్న మరో సాలిడ్ సినిమా ‘కాంత’. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కాంత మీద ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. దుల్కర్ యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అని చెప్తున్నారు. రానా కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర లో మనకి కనిపించబోతున్నాడు.
చాందిని చౌదరి ‘సంతాన ప్రాప్తిరస్తూ’
నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనున్న మరొక డిఫెరెంట్ జోనరా మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తూ’. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. చాందిని చౌదరి, విక్రాంత్ ముఖ్యపాత్రల్లో, సంజీవ్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో ఒక క్యూట్ లవ్ యాంగిల్ కూడా ఉండబోతుంది అని తెలుస్తోంది.
ఓటీటీలో బ్లాక్‌బస్టర్ ట్రీట్!
నవంబర్ 14న ఓటీటీలో కూడా రెండు సినిమాలు ఢీకొంటున్నాయి. ప్రదీప్ రంగనాథన్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘డ్యూడ్’ అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే టైమ్‌కి, సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘తెలుసు కదా’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఇక ఒక్క రోజు గ్యాప్ తో కిరణ్ అబ్బవరం నటించిన ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్ ‘కె ర్యాంప్’ మూవీ నవంబర్ 15 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


