Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRe Releases: ‘శివ’ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ వరకు రీ రిలీజ్‌ల హవా!

Re Releases: ‘శివ’ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ వరకు రీ రిలీజ్‌ల హవా!

Re Releases: సినిమా ప్రేమికులకు నవంబర్ నెల మొత్తం వింటేజ్ సినిమాల వైబ్‌తో హోరెత్తనుంది. ఇప్పటికే ‘శివ’ జోష్ మొదలుపెట్టగా, మొత్తం ఆరు సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నాయి.

- Advertisement -

నవంబర్ రీ రిలీజ్ ఫీవర్‌కు నాంది పలికిన మూవీ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన ‘శివ’. అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన ఈ మూవీని 4Kలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుతున్నారు. వారి కోరిక మేరకు రిలీజైన ఈ సినిమా… థియేటర్లలో వింటేజ్ ఫీల్‌ను మళ్లీ తీసుకువచ్చింది.

ALSO READ: Samantha: కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత – ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌

నవంబర్ 15న సిద్ధార్థ్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రీ-రిలీజ్ కాబోతుంది. ప్రభుదేవా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పాటలకి, ఫాలోయింగ్‌కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. నవంబర్ 21న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ విడుదల కానుంది. చిరంజీవి చేసిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఇది. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అయిన ‘ఆవారా’ నవంబర్ 22న రీ-రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి తమిళ్‌తో ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులో అంతకు మించి ఫ్యాన్ బేస్ ఉంది. జి.వి. ప్రకాష్ అందించిన సూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇప్పటికీ యూత్ రింగ్ టోన్స్‌గా ఉన్నాయి. ఈ మూవీని థియేటర్లలో చూడటం ఒక ఎమోషనల్ ట్రీట్!

ALSO READ: The Paradise: ఏడు కోట్ల‌తో భారీ సెట్‌ – నో కాంప్ర‌మైజ్ అంటున్న నాని ప్యార‌డైజ్ టీమ్‌

నవంబర్ 28న సూర్య నటించిన ‘సికిందర్’ రీ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయినపుడు ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా… యూట్యూబ్‌లో మాత్రం ఒక సంచలనంగా మారింది. విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాను, ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఒక సరికొత్త ఎడిట్ వెర్షన్‌తో థియేటర్లలో తీసుకురాబోతున్నారు. నవంబర్ రీ రిలీజ్‌లకు మహేష్ బాబు ‘బిజినెస్ మ్యాన్’ నవంబర్ 29 రీ రిలీజ్‌తో పర్ఫెక్ట్ క్లైమాక్స్ పడనుంది. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈసారి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad