NTR and Hrithik Roshan War2 Remunerations: వార్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై బాలీవుడ్‌తో సమానంగా తెలుగులోనూ హైప్ కనిపిస్తోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను రాబట్టింది. ఈ ట్రైలర్‌లో స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. వార్ 2లో హృతిక్ రోషన్‌కు ధీటుగా ఎన్టీఆర్ క్యారెక్టర్ కనిపించబోతున్నట్లు ట్రైలర్‌తోనే మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే డెబ్యూ మూవీతోనే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ రికార్డులు తిరగరాయడం ఖాయంగానే కనిపిస్తోంది.
70 కోట్ల రెమ్యూనరేషన్…
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ వార్ 2 మూవీని నిర్మిస్తోంది. ఈ స్పై యాక్షన్ మూవీ కోసం హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. డెబ్యూ మూవీ అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కాంప్రమైజ్ కాలేదట. వార్ 2 కోసం 70 కోట్ల రెమ్యూనరేషన్‌ను ఎన్టీఆర్ అందుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ ఇరవై కోట్లు తక్కువకే ఈ సినిమా చేశాడట. యాభై కోట్ల అడ్వాన్స్ మాత్రమే మేకర్స్ అతడికి ఇచ్చారట. మిగిలింది.. రెమ్యూనరేషన్‌లా కాకుండా లాభాల్లో వాటా తీసుకునే డీల్‌తో హృతిక్ ఈ సినిమాను కంప్లీట్ చేసినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
Also Read – Ind vs Eng 4th Test: పోరాడుతున్న గిల్ సేన.. డ్రా దిశగా నాలుగో టెస్టు..
కియారా అద్వానీ…
వార్ 2 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్, టీజర్‌లో అందాల ఆరబోతతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కోసం కూడా పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 14న హిందీ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో వార్ 2ను సూర్యదేవర నాగవంశీ విడుదలచేస్తున్నారు. తెలుగు రైట్స్‌ను గట్టి పోటీ మధ్య 80 కోట్లకు నాగవంశీ దక్కించుకున్నారు. ఆగస్ట్ 14న వార్ 2తో పాటు రజనీకాంత్ కూలీ రిలీజ్ కాబోతుంది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.
పీరియాడికల్ మూవీ…
వార్ 2తో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మలయాళ యాక్టర్స్ టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కొరటాల శివతో దేవర 2 కమిటయ్యాడు ఎన్టీఆర్.
Also Read – Kingdom Trailer: రాక్షసుల రాజుగా రౌడీస్టార్.. ఆకట్టుకుంటోన్న ‘కింగ్డమ్’ ట్రైలర్


