War2 Review: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ఏంటి? టాక్ ఎలా ఉండబోతుందనే దాని కోసం బాలీవుడ్ కంటే టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డెబ్యూ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో హిట్టు కొడతాడా? లేదా? అన్నది మరో రోజులో డిసైడ్ కాబోతుంది.
కూలీ వర్సెస్ వార్ 2…
ఆగస్ట్ 14న వార్ 2కు పోటీగా రజనీకాంత్ కూలీ రిలీజ్ కాబోతుండటం ఎన్టీఆర్ మూవీకి పెద్ద మైనస్‌గా మారింది. దానికి తోడు మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం నిర్మహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో వార్ 2 ఎలా ఉండబోతుందో అభిమానులకు హింట్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. కాలర్ ఎగరేసి మరి హిట్టుకొట్టబోతున్నాం అని చెప్పడంతో వార్ 2పై అభిమానుల్లో ఉన్న డౌట్స్ చాలా వరకు పటాపంచలు అయ్యాయి.
హీరో ఎవరు?
కాగా వార్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లలో హీరో ఎవరు? విలన్ ఎవరన్నది మాత్రం మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కథ గురించి కూడా ట్రైలర్, టీజర్‌లలో ఎక్కువగా చెప్పకుండా అభిమానుల్లో సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ వచ్చారు. కాగా వార్ 2 మొదలైన 30 నిమిషాల తర్వాతే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని, ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఎన్టీఆర్ పాత్ర సినిమాలో కనిపించదని ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
Also Read- Coolie Movie : ‘కూలీ’ రిలీజ్‌కు ముందే రికార్డుల సంచలనం!
ఫస్ట్ రివ్యూ…
తాజాగా బాలీవుడ్ నుంచి వార్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సినిమా మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం హృతిక్ రోషన్‌పై ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తుందని అంటున్నారు.
హృతిక్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, వారిద్దరిపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌లా ఉంటాయని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు మించిపోయేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఒక్కో ఫైట్ సీన్.. ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుందని చెబుతున్నారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ అదుర్స్…
ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని, సెకండాఫ్ మొత్తం బ్యాక్ టూ బ్యాక్ హై యాక్షన్ సీక్వెన్స్‌లతో గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరిచే విధంగా ఉంటుందట. కన్వీన్సింగ్ క్లైమాక్స్‌తో అయాన్ ముఖర్జీ వార్2 సినిమాను ఎండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
కియారా అద్వానీ హీరోయిన్…
వార్ 2 మూవీని యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. తెలుగులో ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన సినిమాలో హీరోయిన్ ఉందా? లేదా? అన్నది మేకర్స్ దాచిపెట్టారు. థియేటర్లలోనే ఆ ట్విస్ట్‌కు సమాధానం దొరకనున్నట్లు సమాచారం.


