War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్పై యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ యాక్షన్ అంశాలు మినహా కథలో కొత్తదనం లేకపోవడంతో వార్ 2 నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా హృతిక్‌తో పాటు ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కలెక్షన్స్‌తో అదరగొట్టింది. మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్…
వార్ 2 మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా నిర్మాతలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ కుదుర్చుకుంది. కానీ థియేటర్లలో వార్ 2 కు డివైడ్ టాక్ రావడంతో నెలలోపే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వార్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకే రోజు రిలీజ్ కానున్నట్లు సమాచారం.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాకు ఆయనే కథను అందించారు. దాదాపు 400 కోట్లతో ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా వార్ 2 రూపొందింది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్, వారిపై సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ కాన్సెప్ట్, ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గా ఉండటం, ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. వసూళ్ల పరంగా బాలీవుడ్‌లో పర్వాలేదనిపించిన ఈ మూవీ తెలుగులో భారీగా నష్టాలను మిగిల్చింది.
Also Read – Waterproof: మీరు కొనే స్మార్ట్‌ఫోన్ ‘వాటర్‌ప్రూఫ్’ అని చెబితే నమ్మేస్తున్నారా..?
డ్రాగన్… దేవర 2…
ఈ సినిమాలో ఎన్టీఆర్… ఏజెంట్ విక్రమ్ అనే క్యారెక్టర్‌లో కనిపించగా… కబీర్‌గా (హృతిక్ రోషన్) నటించాడు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు ఎన్టీఆర్. డ్రాగన్ పేరుతో తెరకెక్కుతున్న కొత్త షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతుంది. డ్రాగన్‌తో పాటు కొరటాల శివతో దేవర 2 చేయనున్నాడు ఎన్టీఆర్.
Also Read – Mohammed Shami: భార్య తో వివాదంపై నోరు విప్పిన షమీ!


