War 2: ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ స్పై యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై బుధవారం అఫీషియల్‌గా క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వార్ 2 మూవీ రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
డిజాస్టర్…
వార్ 2 మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్టింగ్, వారిపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఔట్‌డేడెట్ స్టోరీలైన్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్‌ల కారణంగా ఈ బాలీవుడ్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. స్టైలిష్ మేకింగ్‌పైనే దృష్టి పెట్టిన మేకర్స్ స్టోరీతో పాటు ఎమోషన్స్‌పై పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.
Also Read – RASHMIKA: రష్మికా మందన్నపై కన్నడ పరిశ్రమ నిషేధం! నిజానికి ఏమైంది?
వంద కోట్ల నష్టం…
400 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ వార్ 2ను నిర్మించింది. థియేటర్లలో ఈ మూవీ 300 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. నిర్మాతలకు వంద కోట్లకుపైనే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లకు బాలీవుడ్, టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ కారణంగా ఈజీగా వార్ 2 ఐదు వందల కోట్ల వసూళ్లను దాటుతుందని అనుకున్నారు. కానీ అంచనాలను అందుకోలేక చతికిలా పడింది.
వార్ 2 తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల వరకు జరిగింది. నెగెటివ్ టాక్ కారణంగా ఫుల్ థియేట్రికల్ రన్‌లో అతి కష్టంగా 55 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ వార్ 2 మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఆయనకు 35 కోట్లకుపైనే ఈ మూవీ నష్టాలను కలిగించినట్లు వార్తలొచ్చాయి. వార్ 2 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. వార్ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 రూపొందింది.
విక్రమ్ వర్సెస్ కబీర్…
వార్ 2 మూవీలో ఎన్టీఆర్… ఏజెంట్ విక్రమ్ అనే క్యారెక్టర్‌లో కనిపించగా… కబీర్‌గా (హృతిక్ రోషన్) నటించాడు. మాజీ రా ఏజెంట్ అయిన కబీర్ దేశానికి వ్యతిరేకంగా మారుతాడు. రా చీఫ్ సునీల్ లూథ్రాతో పాటు మరికొంతమంది బడాబాబులను అంతం చేస్తాడు. కబీర్‌ను పట్టుకోవడానికి విక్రమ్ రంగంలోకి దిగుతాడు? ఆ తర్వాత ఏమైంది? కావ్య లూథ్రాకు కబీర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? కబీర్‌ను విక్రమ్ పట్టుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
వార్ 2 తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్‌తో పాటు దేవర 2 సినిమాలు చేస్తున్నాడు. డ్రాగన్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. దేవర 2 డిసెంబర్ నుంచి మొదలు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Rukmini Vasanth Upcoming Movies : ‘కాంతార చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్‌తో వరుస ఆఫర్స్! బ్యూటీ లక్ ఎలా ఉందో మరి!


