Tuesday, November 5, 2024
Homeచిత్ర ప్రభDevara: ఓటీటీలోకి ఎన్టీఆర్ 'దేవర'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Devara: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘దేవర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Devara| మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర'(Devara). ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలైన బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఎన్టీఆర్ సత్తా చాటారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

కథ ఏంటంటే..?

ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులో ఉన్న రత్నగిరిలో ఎర్ర సముద్రం అని పిలువబడే నాలుగు గ్రామాలు, ప్రయాణిస్తున్న కార్గో షిప్లను లక్ష్యంగా చేసుకుని సముద్రపు దొంగల కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ నాలుగు ఊళ్లకు దేవర(ఎన్టీఆర్) చెప్పిందే వేదం. తన స్నేహితుడు రాయప్ప(శ్రీకాంత్), మరో ఊరి పెద్ద భైరతో(సైఫ్ అలీఖాన్) పాటు మరికొందరితో (కళయరాసన్, షైన్ టామ్ చాకో) కలిసి మురుగ (మురళీ శర్మ) కోసం పనిచేస్తుంటారు. నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని నేవీ అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటారు. ఈ అక్రమ ఆయుధాల కారణంగా తమ జీవితాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన దేవర మురుగ కోసం పనిచేయకూడదని నిర్ణయించుకుంటాడు. తన మాటను కాదని మురుగ కోసం పనిచేయడానికి వెళ్లిన వారిని శిక్షిస్తాడు. దాంతో దేవరకు భయపడి ఎర్రసముద్రం ప్రాంత ప్రజలు సముద్రంలోకి అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అక్రమ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగడానికి దేవర అడ్డు తొలగించాలని భైర ప్లాన్ చేస్తాడు. మరోవైపు దేవర ధైర్యానికి చిరునామా అయితే అతడి కొడుకు వర (ఎన్టీఆర్) భయానికి కేరాఫ్ అడ్రస్‌గా పెరుగుతాడు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా ఎదురించలేకపోతాడు.స్నేహితుడైన భైర తనను చంపాలనుకున్న విషయం తెలిసి దేవర ఏం చేశాడు..? అతడు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి..? వర పిరికివాడిగా ఎందుకు పెరిగాడు..? తండ్రి లక్ష్యాన్ని ఎలా పూర్తిచేశాడు..? ఎర్ర సముద్రం ప్రాంత వాసుల కోసం ఎలాంటి పోరాటం చేశాడు..? అన్నదే దేవర మూవీ కథ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News