War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 ట్రైలర్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. హిందీతో పాటు తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్‌గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
విజువల్ ఫీస్ట్…
వార్ 2 ట్రైలర్‌లో పాన్ ఇండియన్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపించారు. ట్రైలర్‌లో వీరిద్దరి మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బీజీఎమ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. వార్ 2 మూవీపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో ఆకాశాన్ని అంటాయి. ట్రైలర్‌లో చూసింది శాంపిల్ మాత్రమేనని, థియేటర్లలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ విశ్వరూపాన్ని చూడటం ఖాయమని మేకర్స్ చెబుతోన్నారు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్…
రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వార్, టైగర్, జవాన్ సినిమాల ఫేమ్ శ్రీధర్ రాఘవన్ కథ అందిస్తున్నారు.
Also Read – Youngster Heart Attack: 25ఏళ్ల కుర్రాడు.. గుండెపోటుతో మృతి..!
పోరాడలేని యుద్ధాన్ని…
వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్యారెక్టర్స్ పోటాపోటీగా సాగనున్నట్లు ట్రైలర్ లో మేకర్స్ చూపించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన ప్రమాణం ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. నేను ప్రమాణం చేస్తున్నాను… నేను నా పేరును, గుర్తింపును, ఇంటిని అన్నింటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను అంటూ హృతిక్ ప్రమాణంతో ట్రైలర్ ప్రారంభమైంది. నేను మాటిస్తున్నాను. ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడుతాను అంటూ ట్రైలర్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు.
పవర్‌ఫుల్‌గా…
డైలాగ్స్ రూపంలో వచ్చే ఈ ప్రమాణంలోనే సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ఎంత ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నది మేకర్స్ చూపించారు. ట్రైలర్‌లో అసలు ఏజెంట్ ఎవరు అన్నది రివీల్ చేయకుండా ఆడియెన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్.
డేంజరస్ కోవర్ట్ ఆపరేషన్…
వార్ 2 మూవీ గురించి రైటర్ శ్రీధర్ రాఘవన్ మాట్లాడుతూ… దేశ రక్షణ కోసం డేంజరస్ కోవర్ట్ ఆపరేషన్‌లోకి ఇద్దరు ఏజెంట్స్ ఎలా అడుగుపెట్టారన్నదే వార్ 2 మూవీ కథ. దేశం కోసం కుటుంబం, ఇళ్లు, బంధువులతో పాటు అవసరమైతే ప్రాణ త్యాగానికి వెనుకాడని వారి ధైర్యసాహసాలను, పోరాటాన్ని ఈ ప్రమాణం చాటి చెబుతుంది. ఈ ప్రమాణంలోనే వార్ 2 కథ మొత్తం ఉంటుంది. దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్లు ఒకరిపై మరొకరు ఎందుకు యుద్ధానికి దిగాల్సివచ్చింది అన్నది సినిమాలో చివరి వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ ట్విస్ట్‌కు సంబంధించిన సమాధానాలు మొత్తం సినిమా చూస్తేనే అర్థమవుతాయి అని అన్నారు.
Also Read – Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్.. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?
ఆగస్ట్ 14న రిలీజ్…
వార్ 2 మూవీ తెలుగు హిందీ, భాషల్లో భారీ ఎత్తున ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ స్పై యాక్షన్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్లామర్ రోల్‌లో కియారా కనిపించబోతున్నది. ప్రస్తుతం వార్ 2 ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ పాల్గొనబోతున్నారు.


