Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభNayanthara: అలాంటి హీరో ఎన్టీఆర్ ఒక్కరే.. నయన్ స్టేట్మెంట్!

Nayanthara: అలాంటి హీరో ఎన్టీఆర్ ఒక్కరే.. నయన్ స్టేట్మెంట్!

- Advertisement -

Nayanthara: మేమసలు రిహార్సల్స్ చేయం.. డైరెక్ట్ సెట్ కి వెళ్లడం.. సింగిల్ టేక్ చేసేయడం అంటూ కొందరు నటులు గొప్పలు చెప్పుకోవడం చూసే ఉంటాం. అయితే.. వాళ్ళు నిజంగానే అలా చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అంతే చేస్తారు. ఎంత కష్టమైన డాన్స్ అయినా మాస్టర్ చెప్పింది చెప్పినట్లే ఎలాంటి రిహార్సల్స్ లేకుండా సింగిల్ టేక్ లో చేసుకొని వెళ్ళిపోతారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.

ఎన్టీఆర్ తో నయనతార అదుర్స్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టగా ఇప్పటికీ ఈ సినిమా కామెడీ సీన్స్ ఓ ట్రెండ్. ముఖ్యంగా ఎన్టీఆర్ చారి పాత్ర బ్రహ్మానందంతో చేసిన సీన్స్.. ఎన్టీఆర్ నయనతార మధ్య కామెడీ సీన్స్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ సోషల్ మీడియాలో వీటిపై మీమ్స్ కూడా కనిపిస్తుంటాయి. అంతగా ముద్ర వేసుకున్న ఈ సినిమా విశేషాలను తాజాగా నయనతార పంచుకుంది.

నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘కనెక్ట్’. థ్రిల్లర్ జనార్ లో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘కనెక్ట్’ సినిమాతో
పాటు తను నటించిన తెలుగు హీరోల గురించి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో నయనతార, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఊహించని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్ సెట్లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. రిహార్సల్ చేయం.., సింగల్ టేక్ లో చేసేస్తాం అని అందరూ చెప్తూ ఉంటారు.

కానీ నిజంగా రిహార్స ల్ చెయ్యని ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. అదుర్స్ సమయంలో అయితే ఎన్టీఆర్ రిహార్సల్స్ చెయ్యలేదు. రెడీ అనగానే వచ్చి డాన్స్ చేస్తాడు. కాస్త రిహార్సల్స్ చేద్దాం అని అడిగినా, నేను రెడీగా ఉన్నాను మీరు ప్రాక్టీస్ చెయ్యండి అంటాడు. అలాంటి డాన్సర్ ని చూడలేదు’ అంటూ నయన్ చెప్పుకొచ్చింది. దీంతో నయన్ కామెంట్స్ ను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News