Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీపై గత కొన్నాళ్లుగా అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ మొదలయ్యాయని, ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రశాంత్ నీల్ తీసిన సీన్లు, అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. డ్రాగన్‌ను పక్కనపెట్టి ఎన్టీఆర్… దేవర 2 షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ రూమర్స్‌పై ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో పాటు ఇటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా సైలెంట్‌గా ఉండటంతో ఈ వార్తలు నిజమేనని అనుకున్నారు.
తమదైన స్టైల్‌లోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ పుకార్లకు చెక్ పెట్టారు. డ్రాగన్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతోన్న ఓ ఫొటోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ముఖం చూపించకుండా స్టైలిష్ట్ అతడిని గడ్డాన్ని సెట్ చేస్తున్నట్లుగా ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఎన్టీఆర్ మేకోవర్‌ను దగ్గరుండి ప్రశాంత్ నీల్ సెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు కనిపించనటువంటి డిఫరెంట్ లుక్‌తో అభిమానులను ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు. మాస్‌గా ఉంటూనే చాలా పవర్‌ఫుల్‌గా ఈ లుక్ సాగుతుందని వార్తలొస్తున్నాయి. బుధవారం గుబురు గడ్డంతో మీసం మెలేస్తూ ఎన్టీఆర్ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ గడ్డం పెంచినట్లు ఈ ఫొటోతో క్లారిటీ ఇచ్చేశారు.
Also Read – Allu Arjun: బన్నీ లైనప్ మామూలుగా లేదుగా – అన్ని పాన్ ఇండియన్ సినిమాలే
కాగా నవంబర్ నెలాఖరు నుంచి డ్రాగన్ సెకండ్ షెడ్యూల్ మొదలుకాబోతుదంట. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. హీరోహీరోయిన్లతో పాటు ఈ షెడ్యూల్‌లో మలయాళ నటులు టోవినో థామస్, బిజు మీనన్ కూడా జాయిన్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ వరకు నాన్‌స్టాప్‌గా డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. కాగా డ్రాగన్ మూవీ రెండు పార్ట్‌లుగా రూపొందనున్నట్లు కొత్త రూమర్ మొదలైంది. ఈ సెకండ్ పార్ట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.
డ్రాగన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది 2026 జూన్ 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ డేట్‌కు కూడా సినిమా రిలీజ్ కావడం అనుమానంగానే కనిపిస్తోంది.
Also Read – Maruti Suzuki: 3 కోట్ల మార్క్‌ను అందుకున్న మారుతీ సుజుకి


