Tuesday, May 6, 2025
Homeచిత్ర ప్రభNTR: ఎన్టీఆర్ స్టైల్‌కు నెట్‌జన్లు ఫిదా… వైరల్ అవుతున్న ఫోటోలు..!

NTR: ఎన్టీఆర్ స్టైల్‌కు నెట్‌జన్లు ఫిదా… వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగిన తర్వాత, తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్‌కి తిరిగి వచ్చాడు. అయితే, ఎన్టీఆర్ లుక్‌నే చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించిన ఎన్టీఆర్ స్టైలిష్ Rugged అవతారంలో దర్శనమిచ్చాడు. కొంత బక్కగా కనిపించిన ఆయన, గుబురు గడ్డంతో ఉన్న కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

ఫ్యాన్స్ ఈ లుక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి రూపంలో ఎన్టీఆర్ గతంలో కొన్ని సార్లు కనిపించినప్పటికీ, తాజాగా మళ్లీ ఈ లుక్‌లో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక షూటింగ్ విషయానికి వస్తే… ఓ వైపు వార్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూవీ టీమ్ 2026 జూన్ 25న సినిమాను విడుదల చేస్తామనే తేదీ ప్రకటించింది.

త్వరలో ఈ చిత్రం కోసం విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. పవర్ ఫుల్ ఎలివేషన్ సీన్లకు పేరు పొందిన నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎలాంటి మ్యాసీ పాత్రలో కనిపించనున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉండగా, సినిమా క్యాస్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రధాన తారాగణం ఎంపిక చేస్తూనే ఉన్న దర్శక నిర్మాతలు, భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కొత్త లుక్‌తో ఎన్టీఆర్ మరింత మాస్ అప్పీల్ దక్కించుకోనున్నాడన్నది అభిమానుల్లో నమ్మకం. సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నా, ఇప్పటికే సినిమాపై భారీ హైప్ నెలకొనడం విశేషం. ఇంకా షూటింగ్ అప్‌డేట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎప్పుడొస్తాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News