Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNTR War 2: ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు!!

NTR War 2: ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు!!

NTR War 2: బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘వార్‌ 2’. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఓ అరుదైన ఘనతను సంపాదించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’.. తాజా ఎడిషన్‌ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫొటోను ముద్రించడం విశేషం. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ఫొటో.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ ఫొటో షూట్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే ‘ఎస్క్వైర్’ మ్యాగజైన్‌తో ఎన్టీఆర్‌ కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/goodachari-2-release-date-locked/

నేనెప్పుడూ ప్లాన్ చేయలేదు..
“నేను నా జీవితం ఎలా సాగాలని ఎప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ‘కుంగ్‌ ఫూ పాండా’ సినిమాలోని ఒక వాక్యం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది: ‘నిన్నటి రోజు ఒక చరిత్ర, భవిష్యత్తు ఒక రహస్యం, కానీ ఈ క్షణం మన చేతిలోని అమూల్యమైన బహుమతి.’ నా దృష్టి ఎప్పుడూ వర్తమానంపైనే ఉంటుంది. నటుడిగా నేను ఎలాంటి సవాలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. మా కుటుంబ సినీ వారసత్వం భవిష్యత్తులో ఎలా ఉంటుందనే దాని గురించి నాకు ఇప్పుడు స్పష్టత లేదు, దాని కోసం నేను ఏ విధమైన ప్రణాళికలూ వేయలేదు. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే కథలను అందించడం ద్వారా వారికి దగ్గర కావాలనుకున్నా. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా, భావోద్వేగాలతో నిండిన, నిజాయతీపరమైన వ్యక్తిగా నన్ను అందరూ గుర్తుంచుకోవాలని ఆశిస్తాను.” అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/raashi-khanna-re-entry-with-pawan-movie/

ఒకేఒక్క నటుడు ఎన్టీఆర్..
‘వార్‌ 2’ ప్రచారంలో భాగంగా హృతిక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘నేను ఇప్పటివరకూ వర్క్‌ చేసిన సహనటుల్లో రిహార్సల్స్ అవసరం లేని ఒకేఒక్క హీరో ఎన్టీఆర్‌‘‘ అని చెప్పారు. కాగా, ‘వార్‌2’కు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad