Dragon Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ మూవీపై కొత్త రూమర్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో విభేదాల కారణంగా డ్రాగన్ మూవీని ఎన్టీఆర్ పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా క్రేజ్ నెలకొంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
డ్రాగన్‌ను నాలుగేళ్ల క్రితం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఏప్రిల్‌లో ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. 20 రోజులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 ప్రమోషన్స్‌తో ఎన్టీఆర్ బిజీ కావడంతో డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్ గాయపడటం కూడా డ్రాగన్‌పై ఎఫెక్ట్ పడింది. బ్యాక్ టూ బ్యాక్ గ్యాప్‌ల వల్ల ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ డిలేకు ఎన్టీఆర్ కారణమని ప్రశాంత్ నీల్ కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెన్ వచ్చాయట. వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని డ్రాగన్ స్టోరీలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించినట్లు చెబుతున్నారు. ఆ మార్పులు చేయడానికి ప్రశాంత్ నీల్ అంగీకరించలేదట.
దాంతో డ్రాగన్ మూవీ నుంచి తప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లుగా టాలీవుడ్‌లో గట్టిగానే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజీని పక్కనపెట్టాలని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ రూమర్స్‌పై ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ టీమ్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఖండించకపోవడంతో డ్రాగన్ ఆగిపోయింది నిజమేనని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
మరోవైపు కొందరు అభిమానులు మాత్రం డ్రాగన్ మూవీ నుంచి ఎన్టీఆర్ తప్పుకోవడం అన్నది వట్టి రూమర్ అంటూ తేల్చేస్తున్నారు. గాయం నుంచి ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోలేదని అందుకే షూటింగ్ ఆలస్యమవుతుందని చెబుతున్నారు. నవంబర్ నుంచి డ్రాగన్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ పుకార్లపై ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.
రిలీజ్ డేట్ మారనుందా?
డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటులు టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 జూన్ 25న డ్రాగన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read- Teja Sajja: స్టార్ హీరోలతో తేజ సజ్జా పోటీ.. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండా ఓటీటీ డీల్ క్లోజ్


