Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNTR Dragon: ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్ష‌న్‌ - డ్రాగ‌న్ కోసం ప‌దిహేను కోట్ల‌తో సెట్...

NTR Dragon: ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్ష‌న్‌ – డ్రాగ‌న్ కోసం ప‌దిహేను కోట్ల‌తో సెట్ – గ్యాప్ లేకుండా షూటింగ్‌

NTR Dragon: ఇటీవ‌లే వార్ 2తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు ఎన్టీఆర్‌. స్పై యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డివైడ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ హిందీ మూవీ ఏడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

- Advertisement -

డ్రాగ‌న్ మొద‌లు…
వార్ 2 షూటింగ్‌, ప్ర‌మోష‌న్స్ కోసం నాలుగైదు నెల‌లుగా తెలుగు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ తిరిగి డ్రాగ‌న్ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి స‌లార్‌, కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

సెప్టెంబ‌ర్ 1 నుండి…
సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి డ్రాగ‌న్ కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లో మొద‌లు కాబోతున్న‌ట్లు స‌మాచారం. నెల రోజుల పాటు జ‌రిగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ చిత్రీక‌రించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లో ప‌దిహేను కోట్ల‌తో ఓ భారీ హౌజ్ సెట్‌ను వేస్తున్నార‌ట‌. ఈ సెట్ ప‌నులు దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. డ్రాగ‌న్ మూవీకి ఈ సెట్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

Also Read – Bigg Boss Sri Satya: సెగలు రేపుతున్న శ్రీ సత్య.. కంట్రోల్ చేసుకోవడం కష్టమే..

రుక్మిణి వ‌సంత్‌…
ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమెతో పాటు కోలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ మాత్రం హీరోయిన్ల‌ను ఫైన‌లైజ్ చేయ‌లేదు. స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. డ్రాగ‌న్ సినిమాను తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ వార్ 2 షూటింగ్ డిలే ఎఫెక్ట్ డ్రాగ‌న్‌పై ప‌డింది. దాంతో సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న ఈ మూవీ వేస‌విలో రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

మ‌ల‌యాళ హీరో…
డ్రాగ‌న్ మూవీలో మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్‌తో పాటు బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

దేవ‌ర 2 ఉందా?
డ్రాగ‌న్ తో పాటు ప్ర‌స్తుతం దేవ‌ర 2ను ఎన్టీఆర్ అంగీక‌రించారు. గ‌త కొన్నాళ్లుగా ఈ సీక్వెల్ ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దేవ‌ర2 స్థానంలోనే నాగ‌చైత‌న్య‌తో కొర‌టాల శివ ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read – CM Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి… పాలకురాలిపై పగ – ప్రజాస్వామ్యంపై దెబ్బ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad