NTRNEEL: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ మూవీ డ్రాగన్. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2025లోనే డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 కారణంగా డ్రాగన్ షూటింగ్ ఆలస్యమైంది.
డ్రాగన్ అప్‌డేట్…
ఇటీవలే ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడటంతో డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ గాయం నుంచి కోలుకొని ఎన్టీఆర్ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. వారికి ప్రొడ్యూసర్ రవిశంకర్ గుడ్‌న్యూస్ వినిపించాడు. డ్యూడ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో డ్రాగన్‌పై రవిశంకర్ అప్‌డేట్ రివీల్ చేశారు.
Also Read- Bigg Boss Telugu 9: షూటింగ్‌లో ఆ స్టార్ హీరోతో ఇబ్బంది పడ్డా.. బిగ్‌బాస్ సంజన షాకింగ్ కామెంట్స్
సమ్మర్ వరకు నాన్‌స్టాప్…
ఈ నెలాఖరు నుంచి డ్రాగన్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. సమ్మర్ వరకు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ను జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ నెల చివరి నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననున్నారట. డ్రాగన్‌లో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ యాక్టర్స్ టోవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజం, ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని సమాచారం.
పోస్ట్‌పోన్ రూమర్స్…
2026 జూన్ 25న డ్రాగన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలాఖరు వరకు సాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం నాలుగైదు నెలలు టైమ్ పడుతుందట. దాంతో మరోసారి ఈ సినిమా వాయిదాపడే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది చివరలో డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదు.
Also Read- Saif Ali Khan Attack : నా ఇంట్లో నాపై జరిగిన దాడి నిజమే! అదొక భయానక ఘటన – సైఫ్ ఆలీఖాన్
దేవర 2…
డ్రాగన్‌తో పాటు దేవర 2 కమిటయ్యారు ఎన్టీఆర్. ఈ సీక్వెల్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందట. ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు సమాచారం. డ్రాగన్ పూర్తయిన తర్వాతే దేవర 2 షూటింగ్‌ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.


